బడ్జెట్ ధరలో Moto G37 మరియు G37 Power లాంచ్ చేసిన మోటోరోలా.!

బడ్జెట్ ధరలో Moto G37 మరియు G37 Power లాంచ్ చేసిన మోటోరోలా.!

మోటోరోలా ఈ రోజు రెండు కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ రెండు ఫోన్ లను లేటెస్ట్ ఫీచర్స్ మరియు ఆకట్టుకునే డిజైన్ తో లాంచ్ చేసింది. బడ్జెట్ యూజర్ ను లక్ష్యంగా చేసుకొని మోటోరోలా ఈ రెండు ఫోన్లు లాంచ్ చేసింది. మరి ఈ రెండు కొత్త స్మార్ట్ ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Moto G37 మరియు G37 Power: ప్రైస్

మోటోరోలా ఈ రెండు స్మార్ట్ ఫోన్ లను బడ్జెట్ ధరలో లాంచ్ చేసింది. ఇందులో మోటో జి 37 స్మార్ట్ ఫోన్ ను రూ. 13,999 ప్రైస్ ట్యాగ్ తో మరియు జి 7 స్మార్ట్ ఫోన్ ను రూ. 15,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. ఈ రెండు స్మార్ట్ ఫోన్ లు కూడా మే 25వ తేదీ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ మరియు మోటోరోలా అఫీషియల్ సైట్ నుంచి సేల్ అవుతుంది. ఈ ఫోన్ పై రూ. 800 రూపాయల ఫ్లిప్ కార్ట్ Axis మరియు ఫ్లిప్ కార్ట్ SBI క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది.

Moto G37 మరియు G37 Power: ఫీచర్స్

ఈ రెండు స్మార్ట్ ఫోన్ లు కూడా దాదాపు ఒకే విధమైన ఫీచర్స్ కలిగి ఉంటాయి. ఈ రెండు ఫోన్లు MIL STD 810 మిలటరీ గ్రేడ్ సర్టిఫైడ్ డ్యూరబులిటీ ఫీచర్ తో వస్తాయి మరియు చాలా దృఢంగా ఉంటాయని కంపెనీ తెలిపింది. ఈ రెండు ఫోన్లు 6.66 ఇంచ్ HD+ డిస్ప్లేని గొరిల్లా గ్లాస్ 7i రక్షణ తో కలిగి ఉంటాయి. ఈ స్క్రీన్ కలర్ బూస్ట్ టెక్నాలజీ, 1050 నిట్స్ HBM, మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి కలిగి ఉంటాయి.

ఈ రెండు బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు కూడా మీడియాటెక్ Dimensity 6400 చిప్ సెట్ తో లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్లలో 4 జీబీ ఫిజికల్ ర్యామ్ మరియు 4gb వర్చువల్ ర్యామ్ తో మొత్తం 8జీబీ ర్యామ్ ఫీచర్ తో వస్తుంది. అయితే, గోగో జి 37 ఫోన్ 64 జీబీ స్టోరేజ్ మాత్రమే కలిగి ఉంటే మోటో జి 37 పవర్ మాత్రం 128 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ రెండు ఫోన్లు కూడా ఆండ్రాయిడ్ 16 OS తో లాంచ్ అయ్యాయి.

కెమెరా పరంగా, ఈ రెండు ఫోన్లు కూడా 50MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 50MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటాయి. ఈ ఫోన్లు 2K (30fps) వీడియో రికార్డింగ్ మరియు లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటాయి. ఈ రెండు ఫోన్లు Dolby Atmos మరియు Hi res ఆడియో సపోర్ట్ కలిగి ఉంటాయి.

Also Read: అమెజాన్ ప్రైస్ కట్ తో True 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ బెస్ట్ ప్రైస్ లో లభిస్తోంది.!

ఈ రెండు ఫోన్ లలో జి 37 ఫోన్ 5200 mAh బ్యాటరీని 20W ఫాస్ట్ ఛార్జ్ మరియు 6W రివర్స్ ఛార్జ్ తో కలిగి ఉంటుంది. అయితే, జి 37 పవర్ మాత్రం 7000 mAh భారీ బ్యాటరీని 30W ఫాస్ట్ ఛార్జ్ మరియు 6W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile