MOTOROLA G77 Power first sale starts with huge deals on today 12pm
మోటోరోలా గత వారం లాంచ్ చేసిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ MOTOROLA G77 Power ఈరోజు మొదటిసారిగా సేల్ కి అందుబాటులోకి వస్తుంది. మోటోరోలా ఈ స్మార్ట్ ఫోన్ ను బడ్జెట్ ప్రైస్ తో ప్రీమియం ఫీచర్స్ తో అందించింది. ఈ ఫోన్ వేగవంతమైన ప్రాసెసర్, బిగ్ బ్యాటరీ మరియు ఆకట్టుకునే డిస్ప్లే వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ లేటెస్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ నుంచి భారీ డీల్స్ మరియు ఆఫర్స్ తో సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
మోటోరోలా జి77 పవర్ స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 25,999 ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ పై అందించిన భారీ ఆఫర్స్ తో ఈ ఫోన్ ఈరోజు సేల్ నుంచి రూ. 23,999 ధరలో లభిస్తుంది. ఎందుకంటే, ఈ ఫోన్ పై రూ. 2,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ మరియు రూ. 2,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ రెండు ఆఫర్స్ అందించింది.
అయితే, ఈ రెండు ఆఫర్స్ లో ఏదైనా ఒక ఆఫర్ మాత్రమే ఒకసారి లభిస్తుంది. ఈ ఫోన్ సేల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ మోటోరోలా కొత్త ఫోన్ పాంటోన్ ఇంపెనెట్రెబుల్, పాంటోన్ ఫ్యూసియా రెడ్ మరియు పాంటోన్నాటికల్ బ్లూ అనే మూడు సరికొత్త కలర్స్ లో లభిస్తుంది.
Also Read: Samsung 5.1 Dolby సౌండ్ బార్ ఆల్ టైమ్ చవక ధరలో లభిస్తోంది.. ఎక్కడంటే.!
మోటరోలా జి77 పవర్ ఫోన్ లో 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ (FHD+) డిస్‌ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. అందుకే ఇందులో స్మూత్ స్క్రోలింగ్, బెస్ట్ గేమింగ్ మరియు వీడియోలు చాలా స్మూత్ గా కనిపిస్తాయి. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 6400 ప్రాసెసర్ శక్తితో నడుస్తుంది. ఈ ఫోన్ 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఇందులో యాప్స్ వేగంగా పనిచేస్తాయి మరియు రోజువారీ పనులు సులభంగా నిర్వహించవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత Hello UI తో వస్తుంది.
కెమెరా విభాగంలో ఈ ఫోన్ 50MP ప్రధాన కెమెరా మరియు 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్ తో డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. అలాగే, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ లో 7000mAh భారీ బ్యాటరీ ఉండటం వల్ల ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే అధిక సమయం నిలిచి ఉంటుంది. అలాగే, 30W TurboPower ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో ఈ ఫోన్ బ్యాటరీ త్వరగా రీఛార్జ్ చేసే అవకాశం ఉంటుంది. ఇది 5G కనెక్టివిటీ, డ్యూయల్ సిమ్, వై-ఫై, బ్లూటూత్, USB Type-C పోర్ట్, స్టీరియో స్పీకర్ వంటి ఆకట్టుకునే ఇతర ఫీచర్లు కూడా కలిగి ఉంటుంది. ఎక్కువ సమయం నిలిచి ఉండే బ్యాటరీ బ్యాకప్, మంచి పెర్ఫార్మెన్స్ మరియు ఆకర్షణీయమైన డిస్‌ప్లే కోరుకునే యూజర్లకు మోటరోలా జి77 పవర్ ఒక మంచి ఆప్షన్ అవుతుంది.