Motorola Edge 70 Pro Plus: ప్రీమియం ఫీచర్స్ తో మిడ్ రేంజ్ ప్రైస్ లో లాంచ్ అయ్యింది.!

HIGHLIGHTS

మోటోరోలా ఈరోజు ఇండియాలో కొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది

Motorola Edge 70 Pro Plus ను ప్రీమియం ఫీచర్స్ తో మిడ్ రేంజ్ ప్రైస్ లో లాంచ్ చేసింది

ఈ ఫోన్ డిజైన్ మొదలుకొని కెమెరా మరియు బ్యాటరీ వరకు ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది

Motorola Edge 70 Pro Plus: మోటోరోలా ఈరోజు ఇండియాలో కొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. అదే మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను ప్రీమియం ఫీచర్స్ తో మిడ్ రేంజ్ ప్రైస్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ డిజైన్ మొదలుకొని కెమెరా మరియు బ్యాటరీ వరకు ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది. ఈ లేటెస్ట్ మోటోరోలా స్మార్ట్ ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూద్దామా.

Motorola Edge 70 Pro Plus: ప్రైస్

మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో స్మార్ట్ ఫోన్ ను రూ. 47,999 ప్రైస్ తో ఇండియాలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను పాంటోన్ చికోరి కాఫీ, పాంటోన్ స్ట్రోమీ సీ మరియు జిన్ఫండల్ మూడు రంగుల్లో అందించింది. ఈ ఫోన్ పై ICICI మరియు Axis బ్యాంక్ క్రెడిట్ కార్డు రూ. 3,000 అదనపు డిస్కౌంట్ మరియు రూ. 3,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ ఆఫర్ కూడా అందించింది. అయితే, ఈ రెండు ఆఫర్స్ లో ఏదైనా ఒకటి మాత్రమే ఒకసారి లభిస్తుంది. జూన్ 11వ తేదీ మధ్యాహ్నం 12 గంటల ఈ ఫోన్ ఫస్ట్ సేల్ ప్రారంభం అవుతుంది.

Motorola Edge 70 Pro Plus: ఫీచర్స్

మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో అత్యాధునిక ఫీచర్లతో వచ్చిన మోటోరోలా మిడ్ రేంజ్ 5G స్మార్ట్‌ ఫోన్. ఈ ఫోన్ 6.8 అంగుళాల 1.5K సూపర్ AMOLED డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 144Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్ మరియు 5200 నిట్స్ పీక్ బ్రైట్‌ నెస్ తో పాటు గొరిల్లా గ్లాస్ 7i రక్షణ కూడా కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ ను మీడియాటెక్ యొక్క లేటెస్ట్ చిప్ సెట్ Dimensity 8500 Extreme తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ లో 12GB LPDDR5 ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో మల్టీ టాస్కింగ్ మరియు AI పెర్ఫార్మెన్స్ మరింత వేగంగా ఉంటుంది. Android 16 ఆధారంగా పనిచేసే ఈ ఫోన్‌ కు 3 సంవత్సరాల OS అప్‌ డేట్లు మరియు 5 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌ డేట్లు లభిస్తాయి.

ఈ స్మార్ట్ ఫోన్ కెమెరా విషయానికి వస్తే ఈ ఫోన్ లో గొప్ప కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 50MP Sony LYTIA 710 (OIS) మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు 50MP (3.5x ఆప్టికల్ జూమ్) పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా తో ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. సెల్ఫీల కోసం 50MP ఆటో ఫోకస్ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ లో 4K 60FPS వీడియో రికార్డింగ్‌ సపోర్ట్ మరియు లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ అందించింది.

Also Read: ప్రీమియం Dolby Atmos 5.2.4 సౌండ్ బార్ పై అమెజాన్ భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుకోండి.!

ఈ ఫోన్‌ 6500 mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీని 90W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌ లెస్ ఛార్జింగ్ మరియు రివర్స్ ఛార్జింగ్ వంటి ఫీచర్లతో కలిగి ఉంటుంది. అదనంగా, ఇందులో Dolby Atmos సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్టీరియో స్పీకర్లు, Wi-Fi 6E, బ్లూటూత్ 5.4, NFC, వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP68 మరియు IP69 వాటర్ రెసిస్టెన్స్ మరియు MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ వంటి ఫీచర్లతో పూర్తి ఫ్లాగ్‌ షిప్ ప్యాకేజ్‌గా నిలబడుతుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :