Motorola Edge 70 Neo లాంచ్ డేట్ మరియు కంప్లీట్ ఫీచర్స్ రివీల్ చేసిన మోటోరోలా.!

Highlights

Motorola Edge 70 Neo లాంచ్ కోసం గత వారం నుంచి టీజింగ్ స్టార్ట్ చేసిన మోటోరోలా

ఈరోజు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు కంప్లీట్ ఫీచర్స్ కూడా రివీల్ చేసింది

144Hz AMOLED డిస్‌ప్లే మరియు ఆకట్టుకునే డిజైన్ వంటి ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది

Motorola Edge 70 Neo స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం గత వారం నుంచి టీజింగ్ స్టార్ట్ చేసిన మోటోరోలా, ఈరోజు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు కంప్లీట్ ఫీచర్స్ కూడా రివీల్ చేసింది. మోటోరోలా ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ని 7,000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే మరియు ఆకట్టుకునే డిజైన్ వంటి ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

Motorola Edge 70 Neo : లాంచ్ డేట్

మోటోరోలా ఎడ్జ్ 70 నియో స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లో 2026 నవంబర్ 24న విడుదల చేస్తునట్లు కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ లాంచ్ కోసం ఫ్లిప్ కార్ట్ ద్వారా అందించిన ప్రత్యేకమైన టీజర్ పేజీ ద్వారా ఈ ఫోన్ కంప్లీట్ ఫీచర్స్ కూడా కంపెనీ ఈరోజు లాంచ్ డేట్ తో పాటు రివీల్ చేసింది.

Motorola Edge 70 Neo : ఫీచర్స్

ఈ స్మార్ట్‌ ఫోన్‌ లో 6.8 అంగుళాల 1.5K Extreme AMOLED డిస్‌ప్లే అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ స్క్రీన్ 1.5K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్ మరియు 5,200 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ వంటి ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ స్క్రీన్ ని కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i రక్షణ తో అందిస్తుంది. ఈ అప్ కమింగ్ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 7s Gen 3 ప్రాసెసర్‌ తో లాంచ్ అవుతుంది. ఇందులో గరిష్ఠంగా 8GB LPDDR5X ర్యామ్ మరియు AI RAM Boost టెక్నాలజీ ఉండనున్నాయి.

కెమెరా విభాగంలో ఈ ఫోన్ లో OIS 50MP Sony LYTIA 710 ప్రధాన కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. ఈ కెమెరాని Ultra HDR సపోర్ట్‌, AI ఇమేజ్ ఎన్‌హాన్స్‌మెంట్, నైట్ విజన్ మరియు 10X Super Zoom వంటి ఫీచర్లతో అందిస్తుంది. ఈ ఫోన్ కెమెరా 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. అలాగే ఆడియో పరంగా, ఈ ఫోన్ లో డాల్బీ అట్మాస్ సౌండ్ సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్ సెటప్ ఉంటుంది.

ఇక ఈ ఫోన్ కలిగిన బ్యాటరీ విషయానికి వస్తే, ఇందులో 7,000mAh బిగ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 45W Turbo Power ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఈ ఫోన్ ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 53 గంటల వరకు ఉపయోగించుకోవచ్చని టీజర్ లో కంపెనీ పేర్కొంది. అంతేకాదు, ఈ ఫోన్ లో 7.5W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ IP64 రేటింగ్ అండ్ MIL-STD-810H సర్టిఫికేషన్ తో మంచి డ్యూరబుల్ మరియు డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ గా ఉంటుందని మోటోరోలా టీజింగ్ చేసింది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

View full profile