Motorola Edge 70 Neo ఇండియా లాంచ్ తో మోటోరోలా టీజింగ్.!
Motorola Edge 70 Neo లాంచ్ చేయడానికి మోటోరోలా టీజింగ్ స్టార్ట్ చేసింది
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సోషల్ రెడీ ఫోన్ గా కంపెనీ టీజింగ్ చేసింది
ఈ ఫోన్ ని కంపెనీ అఫీషియల్ x హ్యాండిల్ మరియు ఫ్లిప్ కార్ట్ టీజింగ్ చేసింది
Motorola Edge 70 Neo స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో లాంచ్ చేయడానికి మోటోరోలా టీజింగ్ స్టార్ట్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ పేరుతో కాకుండా ఈ ఫోన్ ను వివరాలతో మోటోరోలా ఈ ఫోన్ ను టీజింగ్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సోషల్ రెడీ ఫోన్ గా కంపెనీ టీజింగ్ చేసింది. అయితే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కీలక ఫీచర్స్ తో ఇప్పటికే అనేక రిపోర్ట్ లు ఆన్లైన్ లో దర్శనమిస్తున్నాయి.
Motorola Edge 70 Neo లాంచ్ డేట్
మోటోరోలా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ని కంపెనీ ఇంకా రివీల్ చేయలేదు. అయితే, ఈ ఫోన్ ఈ నెల చివరి నాటికి ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ ని కంపెనీ అఫీషియల్ x హ్యాండిల్ మరియు ఫ్లిప్ కార్ట్ టీజింగ్ చేసింది.
Motorola Edge 70 Neo : అంచనా ఫీచర్స్
మోటోరోలా ఎడ్జ్ 70 నియో స్మార్ట్ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ మరియు సరికొత్తగా కలర్స్ లో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్‌ను కంపెనీ ఇప్పటికే ధృవీకరించింది. తాజా లీకుల ప్రకారం, ఈ ఫోన్ లో 6.78 అంగుళాల OLED డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ స్క్రీన్ 1.5K రిజల్యూషన్ మరియు 144Hz రిఫ్రెష్ రేట్ కూడా కలిగి ఉండవచ్చు. మోటోరోలా ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 7s Gen 3 ప్రాసెసర్ తో అందించే అవకాశం ఉంది. అలాగే, 6GB, 8GB RAM మరియు జతగా 128GB అండ్ 256GB స్టోరేజ్ వేరియంట్లు ఉండొచ్చని లీక్ చెబుతున్నాయి.
ఈ ఫోన్ కలిగి ఉండే కెమెరాల వివరాలు కూడా ఆన్లైన్ లో లీకయ్యాయి. లీక్స్ ప్రకారం, ఈ ఫోన్ లో OIS సపోర్ట్ కలిగిన 50MP Sony LYTIA మెయిన్ కెమెరా జతగా 2MP మాక్రో కెమెరా ఉండనున్నట్లు చెబుతున్నారు. సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా అందించే అవకాశం ఉన్నట్లు లీకులు సూచిస్తున్నాయి.
ఈ ఫోన్ లో 7,000mAh భారీ బ్యాటరీ మరియు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండవచ్చని కూడా లీకులు సూచిస్తున్నాయి. అయితే, ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్స్ ని మోటరోలా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. నెట్టింట్లో నడుస్తున్న లీక్స్ ద్వారా ఈ ఫీచర్స్ ని అందించాము.
అంచనా ప్రైస్
ఈ అప్ కమింగ్ మోటోరోలా స్మార్ట్ ఫోన్ ప్రైస్ వివరాలు కూడా ఆన్లైన్ లీక్ చెబుతున్నాయి. ఈ ఫోన్ ను ఇండియాలో రూ.30,000 నుంచి రూ. 35,000 మధ్య ఉండవచ్చని అంచనా వేసి చెబుతున్నారు. ఇది కూడా లీక్స్ లో కనిపించిన ప్రైస్ మాత్రమే అని గమనించాలి. అఫీషియల్ ప్రైస్ అండ్ ఫీచర్స్ రివీల్ అయిన తర్వాత ఈ ఫీచర్స్ అండ్ ప్రైస్ లో ఎంత నిజం ఉంటుంది తెలుస్తుంది.