Motorola Edge 70 Max: పవర్ ఫుల్ వైర్లెస్ ఛార్జ్ వంటి ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ కి సిద్ధం.!
Moto G77 Power ని లాంచ్ చేసిన మోటోరోలా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కూడా అనౌన్స్ చేసింది
మోటోరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్ ఫోన్ ను పవర్ ఫుల్ వైర్లెస్ ఛార్జ్ తో లాంచ్ చేస్తున్నట్లు టీజింగ్
ఈ ఫోన్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ గా ఇండియాలో అడుగుపెట్టే అవకాశం వుంది
Motorola Edge 70 Max: నిన్న ఇండియన్ ,మార్కెట్ లో బడ్జెట్ 5జి బిగ్ బ్యాటరీ స్మార్ట్ ఫోన్ Moto G77 Power ని లాంచ్ చేసిన మోటోరోలా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కూడా అనౌన్స్ చేసింది. అదే మోటోరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ పవర్ ఫుల్ వైర్లెస్ ఛార్జ్ వంటి ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ చేయనున్నట్లు టీజింగ్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ విశేషాల పై ఒక లుక్కేద్దామా.
SurveyMotorola Edge 70 Max: లాంచ్ డేట్
మోటోరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ ను త్వరలో ఇండియాలో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం ఫ్లిప్ కార్ట్ నుంచి ప్రత్యేకంగా అందించిన టీజర్ పేజీ నుంచి ఈ డీటెయిల్స్ వెల్లడించింది. ఈ ఫోన్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ గా ఇండియాలో అడుగుపెట్టే అవకాశం వుంది.
Motorola Edge 70 Max: ఫీచర్స్
మోటోరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ ప్రీమియం ఫీచర్స్ తో వచ్చే ప్రీమియం ఫోన్ అవుతుంది. ఎడ్జ్ సిరీస్ అంటేనే ప్రీమియం ఫోన్స్ కోసం మోటోరోలా సెట్ చేసిన సిరీస్. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ కూడా ఈ ఫోన్ ప్రీమియం ఫోన్ అని చెప్పడానికి కారణం అవుతాయి.

మోటోరోలా ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను చాలా వేగవంతమైన Turbo Power వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ తో అందిస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు, ఈ ఫోన్ లో మరింత శక్తివంతమైన AI సపోర్ట్ కలిగిన లేటెస్ట్ చిప్ సెట్ ఉంటుందని కూడా మోటోరోలా తెలిపింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్స్ త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది.
Also Read: Moto G77 Power ఫోన్ భారీ లాంచ్ ఆఫర్స్ తో బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యింది.!
మోటోరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్ : లీక్డ్ ఫీచర్స్
మోటోరోలా ఇంకా ఎడ్జ్ 70 మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ ను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే, ఇటీవల వచ్చిన లీక్స్ మరియు రూమర్ల ఆధారంగా ఈ ఫీచర్లు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 8 Gen 5 చిప్ సెట్ తో వచ్చే అవకాశం ఉందని లీక్స్ చెబుతున్నాయి. అంతేకాదు, ఈ ఫోన్ 12GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్ వచ్చే అవకాశం ఉండొచ్చని కూడా రూమర్లు ఉన్నాయి.
ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వచ్చే అవకాశం ఉంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా, అల్ట్రా వైడ్ మరియు టెలిఫోటో సెన్సర్లు ఉండొచ్చని లీక్స్ చెబుతున్నాయి. ఈ ఫోన్ బ్యాటరీ గురించి భిన్నమైన కథనాలు ఉన్నాయి. అవేమిటంటే, ఈ ఫోన్ 5,200mAh నుంచి 8,000mAh వరకు బ్యాటరీ కలిగి ఉండే అవకాశం ఉన్నట్లు లీక్స్ చెబుతున్నాయి. ఇందులో పెద్ద బ్యాటరీతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ మరియు వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండే అవకాశం ఉంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
