తక్కువ ధరలో భారీ ఫీచర్లతో వచ్చిన మోటోరోలా కొత్త ఫోన్ ఫస్ట్ సేల్ రేపు జరగనున్నది. Motorola Edge 40 ని ఇటీవల మోటోరోలా ఇండియాలో విడుదల చేసింది మరియు ఈ స్మార్ట్ ఫోన్ రేపు మొదటి సారిగా సేల్ కి వస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను మోటోరోలా 30 వేల బడ్జెట్ ధరలో భారీ ఫీచర్లతో అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ గురించి మీరు పూర్తిగా తెలుసుకోండి.
Survey
✅ Thank you for completing the survey!
Motorola Edge 40: ధర & స్పెక్స్
మోటోరోలా ఎడ్జ్ 40 స్మార్ట్ ఫోన్ రూ.29,999 ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ రేపు మధ్యాహ్నం 12 గంటలకి Flipakrt నుండి సేల్ అవుతుంది.
మోటోరోలా ఎడ్జ్ 40 144Hz రిఫ్రెష్ రేట్ 3D Curved డిస్ప్లే ని ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 1200 నిట్స్ పీక్ బ్రెట్నెస్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Dimensity 8020 చిప్ సెట్ తో వచ్చిన మొదటి ఫోన్ మరియు IP68 రేటింగ్ కలిగిన నాజూకైన ఫోన్ అని కూడా కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ లో 50MP (OIS) డ్యూయల్ కెమేరా, 68W ఫాస్ట్ ఛార్జింగ్, Dolby Atmos సపోర్ట్ కలిగినా స్టీరియో స్పీకర్లు వంటి ఆకర్షణీమైన ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి.