ChatGPT Down: సడన్ గా డౌన్ అయిన చాట్ జిపిటి యాప్ మరియు వెబ్ పేజీ.!
OpenAI యాజమాన్యంలోని చాట్ జిపిటి ఉన్నట్టుండి సడన్ గా డౌన్ అయ్యింది
చాట్ జిపిటి, యాప్ మరియు వెబ్ పేజీ లో సైతం యూజర్లు సెర్చ్ లేదా ఇమేజ్ వంటివి క్రియేట్ చేయలేకపోతున్నట్లు చెబుతున్నారు
కొంతమంది యూజర్లు అయితే లాగిన్ సమస్యని చూస్తున్నట్లు కూడా డౌన్ డిటెక్టర్ ద్వారా రిపోర్ట్ చేశారు
ChatGPT Down: OpenAI యాజమాన్యంలోని చాట్ జిపిటి ఉన్నట్టుండి సడన్ గా డౌన్ అయ్యింది. చాట్ జిపిటి, యాప్ మరియు వెబ్ పేజీ లో సైతం యూజర్లు సెర్చ్ లేదా ఇమేజ్ వంటివి క్రియేట్ చేయలేకపోతున్నట్లు చెబుతున్నారు. కొంతమంది యూజర్లు అయితే లాగిన్ సమస్యని చూస్తున్నట్లు కూడా డౌన్ డిటెక్టర్ ద్వారా రిపోర్ట్ చేశారు. ప్రముఖ AI ప్లాట్ ఫామ్ మొరాయించడంతో యూజర్లు చాలా అసహనానికి గురైనట్లు చెబుతున్నారు.
SurveyChatGPT Down: ఎప్పుడు జరిగింది?
ఈరోజు రాత్రి 8 గంటల నుంచి చాట్ జిపిటి పై యూజర్లు రిపోర్ట్ చేయడం ప్రారంభించారు. అయితే, 8 గంటల 10 నిమిషాల నుంచి రిపోర్ట్ సంఖ్య పెరగడం మొదలు పెట్టింది. ఈ రిపోర్ట్ అదే తీరుగా కొనసాగడం కూడా మేము గమనించాము.

ఇకపైన అందించిన డౌన్ డిక్టేటర్ గ్రాఫ్ లో కూడా రిపోర్ట్ పెరగడం మీరు చూడవచ్చు. ఇక రిపోర్ట్ లిస్ట్ అయిన గమనిస్తే, 77% శాతం కంటే ఎక్కువ మంది యూజర్లు చాట్ జిపిటి లో సమస్య ను చూసినట్లు రిపోర్ట్ చేశారు. అలాగే, 11 శాతం మంది యాప్ లో మరియు 5 శాతం మంది లాగిన్ చేయడంలో సమస్య చూస్తున్నట్లు రిపోర్ట్ చేశారు.
Also Read: బడ్జెట్ ధరలో 5.2.4 True Dolby Atmos సౌండ్ బార్ లాంచ్ చేసిన GOVO
ChatGPT Down: ఎక్కడ డౌన్ అయ్యింది?
చాట్ జిపిటి డౌన్ అయినట్లు డౌన్ డిక్టేటర్ అందుకున్న రిపోర్ట్ ద్వారా ఈ సమస్య ఎక్కువగా ఉందో తెలుస్తోంది. డౌన్ డిక్టేటర్ అందించిన మ్యాప్ రిపోర్ట్ ప్రకారం, ఈ సమస్య ఎక్కువగా ఇండియాలో ఉన్న యూజర్లు చూసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కలకత్తా మరియు అహ్మదాబాద్ వంటి ప్రధాన నగరాల్లో ఈ సమస్య చూసినట్లు యూజర్లు రిపోర్ట్ చేశారు.
చాట్ జిపిటి డౌన్ గురించి యూజర్లు సోషల్ మీడియాలో ఫన్నీ పోస్ట్ లు మరియు మీమ్స్ తో విరుచుకు పడ్డారు. కొందరైతే చాట్ జిపిటి ని నమ్ముకొని పెడితే నట్టేట ముంచింది, అని ఒక యూజర్ చురకలు అంటించే పోస్ట్ పెట్టారు. ఇలా ఎవరికి నచ్చినట్టు వారు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.
అయితే, ఈ చాట్ జిపిటి డౌన్ కావడానికి తగిన కారణం ఇంకా బయటకు రాలేదు. కంపెనీ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్ విడుదల అయితే కానీ విషయం బయటకు రాదు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile