మోటో బడ్జెట్ 5G ఫోన్ మొదటి సేల్..!

మోటో బడ్జెట్ 5G ఫోన్ మొదటి సేల్..!
HIGHLIGHTS

మోటరోలా బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ Moto G51 5G

క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 480 ప్లస్ 5G ప్రోసెసర్ తో వచ్చిన మొట్టమొదటి ఫోన్

క్వాడ్ ఫిక్షన్ రియర్ కెమెరాను కలిగి వుంది

మోటరోలా రీసెంట్ గా ఇండియాలో విడుదల చేసిన బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ Moto G51 5G. మోటో G51 స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ డిసెంబర్ 16 మద్యహ్నం 12 గంటలకు Flipkart నుండి జరగనుంది. ఈ ఫోన్ కేవలం బడ్జెట్ ధరలో 12 గ్లోబల్ 5G బ్యాండ్స్ సపోర్ట్ మరియు నియర్ స్టాక్ ఆండ్రాయిడ్ 11 వంటి బెస్ట్ ఫీచర్లతో ప్రవేశపెట్టింది. ఈ స్మార్ట్ ఫోన్ Flipkart ప్రత్యేకంగా వచ్చింది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 480 ప్లస్ 5G ప్రోసెసర్ తో వచ్చిన మొట్టమొదటి ఫోన్.

Moto G51: ధర

మోటో జి51 స్మార్ట్ ఫోన్ కేవలం 4GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన సింగల్ వేరియంట్ తో వస్తుంది. ఈ ఫోన్ ఇండిగో బ్లూ మరియు బ్రెట్ సిల్వర్ కలర్ అప్షన్ లలో లభిస్తుంది. ఈ ఫోన్ ఫస్ట్ సేల్ డిసెంబర్ 16 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్ కార్ట్ నుండి మొదలవుతుంది.

Moto G51: స్పెక్స్

మోటో జి51 స్పెషిఫికేషన్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ పెద్ద 6.8 ఇంచ్ FHD+ డిస్ప్లే ని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్నాప్‌ డ్రాగన్ 480 ప్లస్ ఆక్టా కోర్ ప్రాసెసర్‌ మరియు జతగా 4GB RAMతో వస్తుంది. ఇది 12 గ్లోబల్ 5G బ్యాండ్స్ సపోర్ట్ మరియు నియర్ స్టాక్ ఆండ్రాయిడ్ 11 OS వంటి బెస్ట్ ఫీచర్లతో ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ Dolby Atmos సపోర్ట్ తో వస్తుంది.     

కెమెరాల పరంగా ఈ ఫోన్ వెనుక క్వాడ్ ఫిక్షన్ రియర్ కెమెరాను కలిగి వుంది. ఇందులో, 50MP  మైన్ సెన్సార్ కి జతగా వైడ్ మరియు డెప్త్ కెమెరాగా పనిచేసే 8MP సెన్సార్ మరియు 2MP మ్యాక్రో సెన్సార్ వుంది. ముందు 13MP సెల్ఫీ కెమెరాలను కలిగివుంటుంది. ఈ ఫోన్ 20W ర్యాపిడ్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5000 mAh  బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ IP52 వాటర్ రెపెళ్ళంట్ డిజైన్ వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లతో ఈ ఫోన్ రేపు లాంచ్ అవుతోంది.         

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo