మోటోరోలా తన Edge సిరీస్ నుండి స్మార్ట్ ఫోన్ ను ఈ నెల 24న ఇండియాలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. తన అధికారిక ట్విట్టర్ పేజ్ ద్వారా ఈ లాంచ్ టీజర్ ను ట్వీట్ చేసింది. ఈ ఫోన్ పేరు లేదా మరే ఇతర వివరాలను కంపెనీ ఈ ట్వీట్ లో వెల్లడించలేదు. కానీ, #findyourdge హ్యష్ ట్యాగ్ తో ఈ ఫోన్ లాంచ్ గురించి టీజింగ్ చేస్తోంది. దీన్ని బట్టి, ఇటీవల చైనాలో విడుదల చేసిన Moto Edge X30 స్మార్ట్ ఫోన్ మోటో ఎడ్జ్ 30 ప్రో పేరుతో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతోందని ముందుగా వచ్చిన రూమర్లు నిజం కావచ్చని అంచనా వేస్తున్నారు.
Survey
✅ Thank you for completing the survey!
Motorola తన Edge X30 ని ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేయాలని చూస్తున్నట్లు చాలా కాలంగా పుకారు ఉంది. కానీ ఈ ఫోన్ పేరులో మార్పును చేసి లాంచ్ చేయాలని చూస్తోందని ఈ రూమర్లు చెబుతున్నాయి. ఈ రూమర్లు కనుక నిజమైతే 60MP భారీ సెల్ఫీ కెమెరా మరియు భారీ ఫీచర్లు కలిగిన ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్ లో ఈ నెలలో అడుగుపెడుతుంది.
Moto Edge X30 స్మార్ట్ ఫోన్ పెద్ద 6.7 ఇంచ్ FHD+ రిజల్యూషన్ అందించగల OLED డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే పంచ్ హోల్ డిజైన్ తో ఉండడమే కాకుండా 10-Bit కలర్ HDR10+ సపోర్ట్ మరియు 144 Hz రిఫ్రెష్ వంటి హాయ్ ఎండ్ ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో స్పీడ్ మరియు మల్టి టాస్కింగ్ ను చక్కగా నిర్వహించగల Qualcomm Snapdragon 8 Gen 1 ఆక్టా కోర్ ప్రోసెసర్ జతగా ఇంటిగ్రేటెడ్ అడ్రినో 730 GPU గ్రాఫిక్స్ తో వస్తుంది. ఈ శక్తికి జతగా LPDDR5 RAM 12GB వరకు ర్యామ్ మరియు UFS 3.1 256GB వరకూ స్టోరేజ్ అందిస్తుంది.
ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇందులో, 50MP ప్రధాన సెన్సార్ కి జతగా5MP అల్ట్రా వైడ్ సెన్సార్ మరియు 2MP సెన్సార్ కూడా ఉంటాయి. ఈ ఫోన్ లో భారీ 60MP సెల్ఫీ కెమెరా ముందు భాగంలో ఉంటుంది. ఈ Moto ఫోన్ 5000mAh బ్యాటరీని 68W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో అందించింది.