మోటోరోలా యాక్షన్ కెమేరా ఫోన్ అయిన Moto One Action ఫోన్ ఆగస్టు 23 న విడుదలకానుంది

Updated on 19-Aug-2019
HIGHLIGHTS

ఇది అల్ట్రా వైడ్ యాక్షన్ కెమెరాతో వస్తుంది.

ఇటీవలే, మోటరోలా బ్రెజిల్ మరియు మెక్సికోలలో తన వన్ యాక్షన్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది, ఇది అల్ట్రా వైడ్ యాక్షన్ కెమెరాతో వస్తుంది. ఇప్పుడు, ఈ స్మార్ట్ ఫోన్ను ఆగస్టు 23 న భారతదేశంలో విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయించనున్నట్లు కూడా తెలిపింది.

మోటరోలా వన్ యాక్షన్ ఒక 6.3-అంగుళాల ఎల్‌సిడి డిస్‌ప్లేను కలిగి ఉంది, ఇది 1080 × 2520 పిక్సెళ్ళ FHD + డిస్ప్లే మరియు 21: 9 యాస్పెక్ట్ రేషియో మరియు 84 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తిని కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 2.2 గిగాహెర్ట్జ్ ఆక్టా-కోర్ ఎక్సినోస్ 9609 ప్రాసెసర్ ఉంది మరియు 4 జిబి ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్‌తో వస్తుంది. ఒక డేడికేటెడ్ మైక్రో SD కార్డ్ ద్వారా ఈ ఫోను యొక్క స్టోరేజిని 512GB కి వరకూ పెంచవచ్చు. ఈ ఫోన్ వెనుక భాగంలో ఒక వేలిముద్ర సెన్సార్ అందించబడుతుంది.

ఇక కెమెరా గురించి మాట్లాడితే, ఈ స్మార్ట్ ఫోనులో వెనుక ఒక ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, దీనిలో ఒక 16 MP కెమెరా, మరొక 12 MP రెండవ కెమెరా మరియు 5MP మూడవ కెమెరాతో ఉంటుంది. ఇక సెల్ఫీ మరియు వీడియో కాలింగ్ కోసం 12MP ముందు కెమెరా ఉంది.

మోటరోలా వన్ యాక్షన్ ఆండ్రాయిడ్ 9.0 పై పనిచేస్తుంది మరియు ఈ ఫోన్ ఆండ్రాయిడ్ వన్ ప్రోగ్రామ్‌లో భాగంగా రానుంది. ఈ ఫోన్ ఒక 3500 mAh బ్యాటరీని కలిగి ఉంది, ఇది 10W ఛార్జింగుకు మద్దతు ఇస్తుంది. అలాగే, కనెక్టివిటీ ఎంపికల గురించి చూస్తే, ఈ పరికరం డ్యూయల్ 4G VoLTE , వైఫై 802.11 ఎసి (2.4 Ghz + 5 Ghz ), బ్లూటూత్ 5, జిపిఎస్ + గ్లోనాస్, NFC , USB  టైప్-సి, 3.5 mm ఆడియో జాక్ మరియు ఎఫ్‌ఎం రేడియోతో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 160.1 x 71.2 x 9.15mm మరియు 176 గ్రాముల బరువు కలిగి ఉంటుంది.

మోటరోలా వన్ యాక్షన్ బ్రెజిల్ మరియు మెక్సికోలలో 6 286 (సుమారు రూ .20,500) కు లాంచ్ చేయబడింది మరియు ఈ పరికరాన్ని భారతదేశంలో అంతకంటే తక్కువ ధరకు విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ను రియల్మీ ఎక్స్, రెడ్మి కె 20, ఒప్పో కె 3 లకు పోటీగా, సుమారు రూ .20,000 ధరతో లాంచ్ చేయనున్నారు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :