కేవలం Rs.19,999 ధరతో విడుదలైన MOTO ONE VISION స్మార్ట్ ఫోన్ : ఇవే విశేషాలు

HIGHLIGHTS

ఒక పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా మరియు వెనుక ఒక 48MP+ 5MP డ్యూయల్ రియర్ కెమేరా వంటి ప్రత్యేకలతో వస్తుంది.

కేవలం Rs.19,999 ధరతో విడుదలైన MOTO ONE VISION స్మార్ట్ ఫోన్ : ఇవే విశేషాలు

ముందుగా బ్రెజిల్లో విడుదల ఈ మోటో వన్ విజన్ స్మార్ట్ ఫోన్ను, ఈ రోజు ఇండియాలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్, ఒక పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా మరియు వెనుక ఒక 48MP+ 5MP డ్యూయల్ రియర్ కెమేరా వంటి  ప్రత్యేకలతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధరను మాత్రం కేవలం రూ. 19,999 రూపాయలుగా ప్రకటించింది. ముందుగా, ఇదే ధరలో ఒక పంచ్ హోల్ డిజైన్ తో వచ్చిన శామ్సంగ్ గెలాక్సీ M40 వంటి వాటికీ ఇది నేరుగా పోటీ కానున్నట్లు తెలుస్తోంది.          

Digit.in Survey
✅ Thank you for completing the survey!

మోటో వన్ ధర మరియు ఆఫర్లు

మోటో వన్ విజన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజి ధర – Rs.19,999

ఈ మోటో వన్ విజన్ స్మార్ట్ ఫోన్ను కేవలం 4GB ర్యామ్ మరియు 128GB స్టోరేజి కలిగిన ఒకే ఒక్క వేరియంట్ తో లాంచీ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ జూన్ 27 వ తేదీకి Flipkart నుండి జరగనుంది.

Moto One Vision ప్రత్యేకతలు

 ఈ స్మార్ట్ ఫోన్ 6.3-అంగుళాల LCD ప్యానెల్ మరియు HD + రిజల్యూషన్తో వస్తుంది.  ఒక  Exynos 9609 చిప్సెట్టుతో ఇది పనిచేస్తుంది. అయితే కేవలం 4GB RAM మరియు 128GB స్టోరేజి కలిగిన ఒకే ఒక్క వేరియంటుతో మాత్రమే  ఈ ఫోన్ను విడుదల చేసింది. అదనంగా, ఈ ఫోన్ మంచి  డైజైన్ తో ప్రవేశపెట్టబడింది. ఇందులో మీరు 21: 9 ఆస్పెక్ట్ రేషియోని పొందుతారు. అలాగే,  ఈ మోటో వన్ విజన్ యొక్క కెమెరా విభాగం గురించి మాట్లాడినట్లయితే, ఇందులో డ్యూయల్  కెమెరా సెటప్ ఇచ్చారు.

ఇందులో ఒక  48 మెగాపిక్సెల్ ప్రాధమిక కెమెరా సెన్సార్ ఉంది, ఇది f / 1.7 ఎపర్చరు కలిగిన ఒక 48MP కెమెరాతో వస్తుంది. మోటోరోలా నుండి ఒక 48MP కెమేరాతో వచ్చిన మొట్టమొదటి స్మార్ట్ ఫోనుగా ఇది నిలుస్తుంది. అయితే, ఇందులో smasung GM1 సెన్సార్ తో అందించింది. ఈ ప్రధాన కెమేరాకి జతగా,  ఒక 5 MP సెకండ్ కెమేరాని డెప్త్ సెన్సింగ్ కోసం అందించారు. ఇది OIS కు మద్దతు ఇస్తుంది మరియు ఇందులో నైట్ టైం లో మంచి ఫోటోలను తీసుకునేలా,  నైట్ వ్యూ మోడ్నికూడా  అందుకుంటారు. ఈ స్మార్ట్ ఫోనులో, సెల్ఫీల కోసం 25-మెగాపిక్సెల్ కెమెరా ఇవ్వబడింది. ఈ స్మార్ట్ ఫోన్  ఆండ్రాయిడ్ 9 పై OS, స్టాక్ ఎక్స్పీరియన్సుతో వస్తుంది. ఇది బాక్సునుండి 15W టర్బోపవర్ ఛార్జింగ్ మద్దత్తు కలిగిన 3,500mAh బ్యాటరీతో వస్తుంది.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile