మోటో వన్ విజన్ ఒక 48MP కెమేరా మరియు పంచ్ హోల్ సెల్ఫీ కెమరాతో వచ్చింది
మోటరోలా యొక్క తాజా స్మార్ట్ ఫోన్ అయినటువంటి, మోటో వన్ విజన్ లాంచ్ అయ్యింది. ఈ కంపెనీ ఈ ఫోన్ను ముందుగా బ్రెజిల్లో ప్రారంభించింది. మోటోరోలా 299 యూరోలకు (23,500 రూపాయల) ధరతో దీనిని ప్రారంభించింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రత్యేకత గురించి మాట్లాడినట్లయితే, ఇది పంచ్ హోల్ డిస్ప్లే సెల్ఫీ కెమెరా వంటి ప్రత్యేక లక్షణంతో వస్తుంది.
Moto One Vision ప్రత్యేకతలు
ఇక స్పెక్స్ గురించి మాట్లాడినట్లయితే, ఈ స్మార్ట్ ఫోన్ 6.3-అంగుళాల LCD ప్యానెల్ మరియు HD + రిజల్యూషన్తో వస్తుంది. ఒక Exynos 9609 చిప్సెట్టుతో ఇది పనిచేస్తుంది. అయితే కేవలం 4GB RAM మరియు 128GB స్టోరేజి కలిగిన ఒకే ఒక్క వేరియంటుతో మాత్రమే ఈ ఫోన్ను విడుదల చేసింది. అదనంగా, ఈ ఫోన్ మంచి డైజైన్ తో ప్రవేశపెట్టబడింది. ఇందులో మీరు 21: 9 ఆస్పెక్ట్ రేషియోని పొందుతారు. అలాగే, ఈ మోటో వన్ విజన్ యొక్క కెమెరా విభాగం గురించి మాట్లాడినట్లయితే, ఇందులో డ్యూయల్ కెమెరా సెటప్ ఇచ్చారు.
ఇందులో ఒక 48 మెగాపిక్సెల్ ప్రాధమిక కెమెరా సెన్సార్ ఉంది, ఇది f / 1.7 ఎపర్చరు కలిగిన ఒక 48MP కెమెరాతో వస్తుంది. మోటోరోలా నుండి ఒక 48MP కెమేరాతో వచ్చిన మొట్టమొదటి స్మార్ట్ ఫోనుగా ఇది నిలుస్తుంది. ఈ ప్రధాన కెమేరాకి జతగా, ఒక 5 MP సెకండ్ కెమేరాని డెప్త్ సెన్సింగ్ కోసం అందించారు. ఇది OIS కు మద్దతు ఇస్తుంది మరియు ఇందులో నైట్ టైం లో మంచి ఫోటోలను తీసుకునేలా, నైట్ వ్యూ మోడ్నికూడా అందుకుంటారు. ఈ స్మార్ట్ ఫోనులో, సెల్ఫీల కోసం 25-మెగాపిక్సెల్ కెమెరా ఇవ్వబడింది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 9 పై OS, స్టాక్ ఎక్స్పీరియన్సుతో వస్తుంది. ఇది ఒక 15W టర్బోపవర్ ఛార్జింగ్ మద్దత్తు కలిగిన 3,500mAh బ్యాటరీతో వస్తుంది.