Moto G85: పవర్ ఫుల్ చిప్ సెట్, Sony కెమెరా మరియు సూపర్ స్క్రీన్ తో రేపు లాంచ్ అవుతుంది.!
Moto G85 రేపు ఇండియాలో లాంచ్ అవుతుంది
ఈ ఫోన్ ను డిఫరెంట్ కలర్స్ మరియు గొప్ప ఫీచర్స్ తో లాంచ్ చేస్తోంది
ఈ ఫోన్ Sony కెమెరా మరియు సూపర్ స్క్రీన్ తో లాంచ్ అవుతుంది
Moto G85: మోటోరోలా కొత్త స్మార్ట్ ఫోన్ మోటో జి 85 రేపు ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ పవర్ ఫుల్ చిప్ సెట్, Sony కెమెరా మరియు సూపర్ స్క్రీన్ తో రేపు లాంచ్ అవుతుంది.మోటో G సిరీస్ నుంచి మంచి ఫీచర్స్ కలిగిన చాలా బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లను తీసుకు వచ్చిన మోటోరోలా, ఇప్పుడు ఈ ఫోన్ ను డిఫరెంట్ కలర్స్ మరియు గొప్ప ఫీచర్స్ తో లాంచ్ చేస్తోంది.
SurveyMoto G85: లాంచ్
మోటో జి 85 స్మార్ట్ ఫోన్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ Flipkart నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
Also Read: iQOO Z9 Lite: 12GB ర్యామ్ మరియు అందమైన డిజైన్ తో వస్తోంది.!
Moto G85: ఫీచర్లు
మోటోరోలా ఈ స్మార్ట్ ఫోన్ ను అల్ట్రా ప్రీమియం వేగాన్ డిజైన్ మరియు పెంటోన్ క్యూరేటెడ్ కలర్ తో వస్తుంది. ఇది 7.59mm మందంతో చాలా సన్నగా ఉంటుంది. ఈ ఫోన్ లో 10-bit 3D కర్వుడ్ pOLED డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ మరియు గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో ఉంటుంది. ఈ స్క్రీన్ 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో కూడా ఉంటుంది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 6s జెన్ 3 పవర్ ఫుల్ చిప్ సెట్ తో వస్తుంది. ఈ ప్రోసెసర్ కి జతగా 12GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ గా ఉంటాయి.

ఈ స్మార్ట్ ఫోన్ లో OIS సపోర్ట్ కలిగిన Sony – LYTIA 600 సెన్సార్ మరియు 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఈ కెమెరా డ్యూయల్ కెమెరా అయినా క్వాడ్ కెమెరా పనులు చేస్తుంది. ఈ ఫోన్ కోబాల్ట్ బ్లూ, అర్బన్ గ్రే మరియు ఆలివ్ గ్రీన్ మూడు కలర్ ఆప్షన్ లలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లో 33W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో Dolby Atmos సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. ఈ ఫోన్ Hi-Res Audio సపోర్ట్ తో కూడా వస్తుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile