Moto G85: మోటోరోలా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది. మోటో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సిరీస్ అయిన G Series నుండి ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేస్తోంది. ఈ సిరీస్ నుండి మోటో జి 85 స్మార్ట్ ఫోన్ ను వచ్చే వారం ఇండియాలో విడుదల చేస్తోంది. ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ మరియు లాంచ్ డేట్ ను కూడా కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ను డిఫరెంట్ కలర్స్ మరియు స్టైల్ తో లాంచ్ కి సిద్ధం చేసినట్లు మోటోరోలా ఆటపట్టిస్తోంది.
Survey
✅ Thank you for completing the survey!
Moto G85: లాంచ్ డేట్
మోటో జి 85 స్మార్ట్ ఫోన్ ను జూలై 10వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఎప్పటిలాగానే, మోటో జి 85 స్మార్ట్ ఫోన్ కోసం Flipkart ప్రత్యేకమైన మైక్రో సైట్ మరియు మైక్రో సైట్ బ్యానర్ ను అందించింది. ఈ పేజీ నుండి ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ తో టీజింగ్ చేస్తోంది.
మోటో జి 85 స్మార్ట్ ఫోన్ లో గొరిల్లా గ్లాస్ 5 రక్షణ కలిగిన 3D కర్వుడ్ pOLED డిస్ప్లే ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 10 bit కలర్ సపోర్ట్ మరియు 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్స్ తో వస్తుంది. ఈ ఫోన్ ను క్వాల్కమ్ లేటెస్ట్ చిప్ సెట్ Snapdragon 6s Gen 3 తో అందిస్తుంది. అంతేకాదు, మంచి పెర్ఫార్మెన్స్ కోసం ఈ ఫోన్ లో 12GB ర్యామ్ సపోర్ట్ మరియు 256GB హెవీ స్టోరేజ్ సపోర్ట్ కూడా వుంది.
Moto G85
ఈ ఫోన్ లో వెనుక క్వాడ్ ఫిక్షన్ కెమెరా వుంది. ఇందులో, OIS సపోర్ట్ తో 50MP Sony LYTIA 600 మెయిన్ సెన్సార్ మరియు 8MP అల్ట్రా వైడ్ / మ్యాక్రో సెన్సార్ వున్నాయి. ఈ ఫోన్ లో ముందు 32MP సెల్ఫీ కెమెరా ఉన్నట్టు కూడా కంపెనీ కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి మరియు ఇది Dolby Atmos మరియు Hi-Res సపోర్ట్ తో ఉంటాయి.
ఈ ఫోన్ ను మూడు డిఫరెంట్ కలర్స్ లో లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ కోబాల్ట్ బ్లూ, ఆలివ్ గ్రీన్ మరియు అర్బన్ గ్రే కలర్ లలో వస్తుంది. ఈ ఫోన్ లో 33W టర్బో పవర్ ఛార్జర్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీ కలిగి వుంది.