Moto G77 Power top features know before launch
Moto G77 Power: మోటోరోలా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్స్ కూడా విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను బ్యాటరీ ప్రత్యేకమైన పవర్ సిరీస్ నుంచి లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ ను కూడా 7000 mAh భారీ బ్యాటరీతో లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ లో కేవలం బ్యాటరీ మాత్రమే కాదు డిజైన్ మొదలుకొని కెమెరా వరకు చాలా విభాగాల్లో బెస్ట్ ఫీచర్స్ కలిగి ఉందని మోటోరోలా తెలిపింది. మరి మోటోరోలా లాంచ్ చేయబోతున్న లాంచ్ కంటే ముందే టాప్ 5 ఫీచర్స్ తెలుసుకుందామా.
మోటో జి 77 పవర్ స్మార్ట్ ఫోన్ జూలై 8న ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్స్ ను కూడా ఫ్లిప్ కార్ట్ ద్వారా మోటోరోలా టీజింగ్ చేసింది.
ఈ అప్ కమింగ్ మోటో ఫోన్ దృఢమైన MIL-STD 810H మిలటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ డిజైన్ తో వస్తుంది. ఇది క్రింద పడినా కూడా ఆ షాక్ ను తట్టుకొనే సత్తా కలిగి ఉంటుంది మరియు ప్రీమియం వేగాన్ లెథర్ ఫినిష్ తో వస్తుంది.
మోటో జి 77 పవర్ ఫోన్ 6.72 ఇంచ్ స్క్రీన్ ను FHD+ రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు గొరిల్లా గ్లాస్ 7i రక్షణ కలిగి ఉంటుంది. ఇది గేమింగ్ మరియు ఎంటర్టైన్మెంట్ కోసం స్మూత్ విజువల్స్ అందిస్తుంది. ప్రీమియం వేగాన్ లెథర్ ఫినిష్ తో అందించింది.
ఈ మోటో ఫోన్ 50MP Sony LYT 600 ప్రధాన కెమెరా జతగా 8MP అల్ట్రా వైడ్ కెమెరా తో మరో సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ముందు 32MP సెల్ఫీ కెమెరాని కూడా ఈ ఫోన్ లో అందించింది.
Also Read: గోట్ సేల్ నుంచి iPhone 17 Pro ఫోన్ పై రూ. 18,000 భారీ డిస్కౌంట్ ఆఫర్ చేసిన ఫ్లిప్ కార్ట్.!
ఈ ఫోన్ 7000 mAh భారీ బ్యాటరీ కలిగి ఉంటుంది మరియు ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. నార్మల్ వాడకంతో ఈ ఫోన్ 3 రోజుల బ్యాకప్ అందిస్తుందని మోటోరోలా తెలిపింది.
ఈ అప్ కమింగ్ మోటోరోలా ఫోన్ క్లీన్ ఆండ్రాయిడ్ 16 OS తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 17 OS కి అప్ గ్రేడ్ అవుతుంది. ఈ ఫోన్ లో Dolby Atmos మరియు Hi Res Audio సపోర్ట్ కలిగిన స్టీరియో స్పీకర్ ఉంటాయి.