Moto G77 Power : లాంచ్ కంటే ముందే టాప్ 5 ఫీచర్స్ తెలుసుకుందామా.!

HIGHLIGHTS

Moto G77 Power లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్స్ కూడా విడుదల చేసింది

డిజైన్ మొదలుకొని కెమెరా వరకు చాలా విభాగాల్లో బెస్ట్ ఫీచర్స్ కలిగి ఉందని మోటోరోలా తెలిపింది

ఈ ఫోన్ 7000 mAh భారీ బ్యాటరీ కలిగి ఉంటుంది

Moto G77 Power : లాంచ్ కంటే ముందే టాప్ 5 ఫీచర్స్ తెలుసుకుందామా.!

Moto G77 Power: మోటోరోలా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్స్ కూడా విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను బ్యాటరీ ప్రత్యేకమైన పవర్ సిరీస్ నుంచి లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ ను కూడా 7000 mAh భారీ బ్యాటరీతో లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ లో కేవలం బ్యాటరీ మాత్రమే కాదు డిజైన్ మొదలుకొని కెమెరా వరకు చాలా విభాగాల్లో బెస్ట్ ఫీచర్స్ కలిగి ఉందని మోటోరోలా తెలిపింది. మరి మోటోరోలా లాంచ్ చేయబోతున్న లాంచ్ కంటే ముందే టాప్ 5 ఫీచర్స్ తెలుసుకుందామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Moto G77 Power : ఎప్పుడు లాంచ్ అవుతుంది?

మోటో జి 77 పవర్ స్మార్ట్ ఫోన్ జూలై 8న ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్స్ ను కూడా ఫ్లిప్ కార్ట్ ద్వారా మోటోరోలా టీజింగ్ చేసింది.

Moto G77 Power : టాప్ 5 ఫీచర్స్

డిజైన్

ఈ అప్ కమింగ్ మోటో ఫోన్ దృఢమైన MIL-STD 810H మిలటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ డిజైన్ తో వస్తుంది. ఇది క్రింద పడినా కూడా ఆ షాక్ ను తట్టుకొనే సత్తా కలిగి ఉంటుంది మరియు ప్రీమియం వేగాన్ లెథర్ ఫినిష్ తో వస్తుంది.

డిస్ప్లే

మోటో జి 77 పవర్ ఫోన్ 6.72 ఇంచ్ స్క్రీన్ ను FHD+ రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు గొరిల్లా గ్లాస్ 7i రక్షణ కలిగి ఉంటుంది. ఇది గేమింగ్ మరియు ఎంటర్టైన్మెంట్ కోసం స్మూత్ విజువల్స్ అందిస్తుంది. ప్రీమియం వేగాన్ లెథర్ ఫినిష్ తో అందించింది.

కెమెరా

ఈ మోటో ఫోన్ 50MP Sony LYT 600 ప్రధాన కెమెరా జతగా 8MP అల్ట్రా వైడ్ కెమెరా తో మరో సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ముందు 32MP సెల్ఫీ కెమెరాని కూడా ఈ ఫోన్ లో అందించింది.

Also Read: గోట్ సేల్ నుంచి iPhone 17 Pro ఫోన్ పై రూ. 18,000 భారీ డిస్కౌంట్ ఆఫర్ చేసిన ఫ్లిప్ కార్ట్.!

బ్యాటరీ

ఈ ఫోన్ 7000 mAh భారీ బ్యాటరీ కలిగి ఉంటుంది మరియు ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. నార్మల్ వాడకంతో ఈ ఫోన్ 3 రోజుల బ్యాకప్ అందిస్తుందని మోటోరోలా తెలిపింది.

OS అండ్ ఇతర ఫీచర్స్

ఈ అప్ కమింగ్ మోటోరోలా ఫోన్ క్లీన్ ఆండ్రాయిడ్ 16 OS తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 17 OS కి అప్‌ గ్రేడ్ అవుతుంది. ఈ ఫోన్ లో Dolby Atmos మరియు Hi Res Audio సపోర్ట్ కలిగిన స్టీరియో స్పీకర్ ఉంటాయి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile