Moto G71 5G: ఇండియాలో విడుదల కానుంది.. ఎప్పుడంటే..!

HIGHLIGHTS

Moto G71 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది

బడ్జెట్ ధరలో OLED డిస్ప్లే కలిగినMoto G71 5G స్మార్ట్ ఫోన్

మోటో జి71 5జి స్మార్ట్ ఫోన్ 6.4 ఇంచ్ FHD+ OLED డిస్ప్లేని కలిగి వుంది

Moto G71 5G: ఇండియాలో విడుదల కానుంది.. ఎప్పుడంటే..!

మార్కెట్లో చాలా స్పీడ్ గా స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తున్న మొబైల్ తయారీ సంస్ధలలో మోటోరోలా ఒకటిగా నిలుస్తుంది. ఇటీవలే Moto G31 స్మార్ట్ ఫోన్ విడుదల చేసిన మోటోరోలా, ఇప్పుడు ఇదే సిరీస్ నుండి Moto G71 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ ఫోన్ ఇటీవలే చైనాలో విడుదల చేయబడింది మరియు ఇప్పుడు ఇండియా లో లాంచ్ కోసం సిద్ధమవుతోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ ఫోన్ లాంచ్ గురించి ముందుగా GSMArena నివేదిక అందించింది. ఈ నివేదిక ప్రకారం, Motorola Moto G71ని జనవరి 10న భారత మార్కెట్లో లాంచ్ చేయవచ్చని తెలిపింది. అయితే, ఈ సమాచారం కేవలం టిప్‌స్టర్ అంచనాలు వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి, దీన్ని పూర్తిగా నిజమని నిర్దారించలేము. అంతేకాదు, మోటోరోలా నుండి దీని గురించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ, ఇదే కనుక నిజమైతే త్వరలోనే బడ్జెట్ ధరలో OLED డిస్ప్లే కలిగినMoto G71 5G స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ కావచ్చు.                             

Moto G71 5G: స్పెక్స్ (చైనా వేరియంట్)

మోటో జి71 5జి స్మార్ట్ ఫోన్ 6.4 ఇంచ్ FHD+ OLED డిస్ప్లేని కలిగి వుంది. ఈ డిస్ప్లే 120HZ రిఫ్రెష్ రేట్ మరియు 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో నడుస్తుంది. దీనికి జతగా 8GB ర్యామ్ మరియు 128 GB స్టోరేజ్ కూడా జతచెయ్యబడింది. అంతేకాదు, 3GB వరకు వర్చువల్ ర్యామ్‌ను పెంచుకునే అవకాశం కూడా ఉంది.

ఇక కెమెరా విషయానికి వస్తే, ఈ మోటో జి71 5జి లో వెనుక ట్రిపుల్ రియర్ వుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్ మరియు 2MP మాక్రో సెన్సార్ ఉన్నాయి. ముందుభాగంలో సెల్ఫీల కోసం 13MP సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 OS పైన నడుస్తుంది. ఈ ఫోన్ 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000 mAh బ్యాటరీని కలిగి వుంది.

Moto G71 5G: ధర (చైనా వేరియంట్) 

Moto G71 5G ఫోన్ యొక్క 8GB RAM మరియు 128GB స్టోరేజ్ వేరియంట్ ధర RMB 1,699 (సుమారు రూ. 18,900).           

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo