సైలెంటుగా విడుదలైన మోటో G 7 పవర్

సైలెంటుగా విడుదలైన మోటో G 7 పవర్
HIGHLIGHTS

ఒక 5000 mAh బ్యాటరీ మరియు 15W టర్బోచార్జింగుతో వస్తుంది.

మోటోలారా ఈ నెలలో బ్రెజిల్లో తన మోటో G7 సిరీసును ప్రారంభించింది, ఇప్పుడు భారతదేశంలో ఈ లైనప్ యొక్క నాలుగు ఫోన్లలో ఒకదానిని  సైలెంటుగా విడుదల చేసింది. భారతదేశంలో, మోటో జి 7 పవర్ లభ్యతను నిస్సందేహంగా ప్రకటించింది. భారతదేశంలో, ఈ మోటో G7 పవర్ యొక్క 4GB RAM మరియు 64GB స్టోరీ వేరియంటును కేవలం రూ. 13,999 ధరతో విక్రయించబోతుందని ప్రకటించింది. అయితే, ముందుగా  మోటో G7 పవర్,  Flipkart ద్వారా 

అమ్మకానికి వెళ్తుంది అని నివేదించబడింది, కానీ ఈ మోటో G7 పవర్ భారతదేశం అంతటా మోటో హబ్ మరియు మోటో ప్రాధాన్యత దుకాణాలు సహా,ఈ ఫోన్ నేడు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో కూడా అందుబాటులో ఉంటుందని,  Digit.in కు ధ్రువీకరించారు. ఈ సంస్థ ఏ ఆన్లైన్ రిటైలర్ను పేర్కొనలేదు మరియు పలు ఆన్లైన్ ప్లాట్ఫారాల నుండి ఈ ఫోన్ రిటైల్ అవుతుందని అన్నారు.

మోటో G7 పవర్ యొక్క USP దాని భారీ 5000 mAh బ్యాటరీ, సంస్థ వాదనల ప్రకారం, ఇది ఒక్క ఛార్జ్ మీద 60 గంటలపాటు కొనసాగుతుందని చెబుతోంది. అలాగే, వినియోగదారులు 15W టర్బోపవర్ ఛార్జింగుతో, కేవలం 15 నిమిషాల్లో 9 గంటల చార్జింగును పొందవచ్చు అని కూడా మోటో చెబుతోంది. ఈ ఫోన్ ఒక సిరామిక్ బ్లాక్ రంగు వేరియంట్లో అందుబాటులో ఉంటుంది. అయితే, G7 సిరీసు యొక్క ఇతర ఫోన్లు ఇండియాలో ఎప్పుడు విడుదల చేయబడతాయనే విషయం   మాత్రం ఎటువంటి సమాచారం లేదు.

Moto G7 Power – స్పెసిఫికేషన్లు

ఈ ఫోన్లో ఒక ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 632 ప్రాసెసర్ ఉంది, ఇది 1.8GHz వద్ద క్లాక్ చెయ్యబడింది, మరియు ఒక అడ్రినో 506 GPU తో జతగా వస్తుంది. ఒక మైక్రోఎస్డీ కార్డు ద్వారా 512 గిగాబైట్ల వరకు విస్తరించే సామర్ధ్యంతో పాటగా 4GB RAM మరియు 64GB అంతర్గత మెమొరీతో దాని ప్రాసెసర్ అనుసంధానించబడుతుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 9 పైన నడుస్తుంది మరియు వేలిముద్ర సెన్సార్ మరియు ఫేస్ అన్లాకుతో వస్తుంది. ఇది ఒక చిన్న నోచ్ కలిగిన ఒక  6.2-అంగుళాల HD + మ్యాక్స్ విజన్ డిస్ప్లేను  కలిగి ఉంది, ఇది 19: 9 యాస్పెక్ట్ రేషియో అందిస్తుంది.

ముందు పేర్కొన్న విధంగా, మోటో G7 పవర్ ఒక 5000mAh బ్యాటరీ తో వస్తుంది మరియు 15W టర్బో పవర్ ఛార్జింగుతో వస్తుంది. ఇక కెమెరా విభాగంలో, ఈ ఫోన్ ఒక f2.0 ఎపర్చరుతో సింగల్ 12MP సెన్సార్  వస్తుంది. అయితే, ఇది Google Lens ఇంటిగ్రేషనుతో వస్తుంది మరియు ఒక LED ఫ్లాష్ ఉంది.ఇంకా, ముందుభాగంలో  F2.2 ఎపర్చరుతో ఒక 8MP సెల్ఫీ కెమెరాని కూడా కలిగివుంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo