Moto G45: మోటో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సిరీస్ ను నుండి మరో పవర్ ఫుల్ ఫోన్ వస్తోంది.!

HIGHLIGHTS

మోటోరోలా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి అనౌన్స్ చేసింది

మోటో బడ్జెట్ సిరీస్ అయిన G సిరీస్ నుంచి ఈ ఫోన్ ను విడుదల చేస్తోంది

Moto G45 ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజిని అందించింది

Moto G45: మోటో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సిరీస్ ను నుండి మరో పవర్ ఫుల్ ఫోన్ వస్తోంది.!

Moto G45: మోటోరోలా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి అనౌన్స్ చేసింది. మోటో బడ్జెట్ సిరీస్ అయిన G సిరీస్ నుంచి ఈ ఫోన్ ను విడుదల చేస్తోంది. ఇప్పటికే G సిరీస్ నుంచి చాలా ఫోన్ లను అందించిన మోటోరోలా ఇప్పుడు మరొక స్మార్ట్ ఫోన్ ను కూడా తీసుకువస్తోంది. ఈ ఫోన్ ని స్లీక్ డిజైన్, పవర్ ఫుల్ ప్రోసెసర్ వంటి మరిన్ని ఫీచర్స్ తో తీసుకువస్తున్నట్లు టీజింగ్ చేస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Moto G45: లాంచ్

మోటో జి45 స్మార్ట్ ఫోన్ ను ఆగస్టు 21వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో విడుదల చే
న్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజిని అందించింది మరియు ఈ పేజీ నుంచి టీజింగ్ కూడా చేస్తోంది.

Also Read: బ్రాండెడ్ Earphones పై Myntra ధమాకా ఆఫర్స్: రూ. 500 లోపల గొప్ప ఇయర్ ఫోన్ అందుకోండి.!

Moto G45: ఫీచర్స్

మోటో జి 45 స్మార్ట్ ఫోన్ ను అల్ట్రా ప్రీమియం డిజైన్ మరియు 120 Hz రిఫ్రెహ్ రేట్ కలిగిన 6.5 ఇంచ్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను Snapdragon 6 Gen 3 చిప్ సెట్ తో అందిస్తున్నట్లు మోటోరోలా తెలిపింది. ఈ ఫోన్ లో 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ లతో ఉంటుంది. ఈ ఫోన్ లో 5000 mAh బిగ్ బ్యాటరీ మరియు టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది.

Moto G45 Features

ఇక ఈ ఫోన్ కలిగి ఉన్న కెమెరా సెటప్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 50MP క్వాడ్ పిక్సెల్ మెయిన్ కెమెరా మరియు జతగా మరొక కెమెరా కలిగిన డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. అంతేకాదు, ఈ ఫోన్ లో 16MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లతో పాటు Dolby Atmos మరియు Hi-Res సపోర్ట్ కూడా వుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo