Moto G40: మంచి ఫీచర్లు మరియు ఇన్ బిల్ట్ సెక్యురితో వచ్చింది

Moto G40: మంచి ఫీచర్లు మరియు ఇన్ బిల్ట్ సెక్యురితో వచ్చింది
HIGHLIGHTS

మోటో G40 స్మార్ట్ ఫోన్ తక్కువ ధరలో లాంచ్

మోటో G40 స్మార్ట్ ఫోన్ తక్కువ ధరలో లాంచ్

మంచి డిస్కౌంట్ అఫర్ ని కూడా ప్రకటించింది.

మోటోరోలా ఈరోజు తన Moto G40 మరియు Moto G60 స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. వీటిలో మోటో G40 స్మార్ట్ ఫోన్ తక్కువ ధరలో వుంటుంది. అయితే, G40 స్మార్ట్ ఫోన్ ను HDR 10 సపోర్ట్ కలిగిన పెద్ద డిస్ప్లే, వేగవంతమైన క్వాల్కమ్ గేమింగ్ ప్రాసెసర్ తో పాటుగా బిజినెస్ గ్రేడ్ సెక్యూరిటీ మరియు మరిన్ని లేటెస్ట్ ఫీచర్లతో తీసుకొచ్చింది. అంతేకాదు, మంచి డిస్కౌంట్ అఫర్ ని కూడా ప్రకటించింది.  

Moto G40 : ధర

మోటో G40 రెండు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు ఈ క్రింద చూడవచ్చు.

1.మోటో G40 ( 4GB + 64GB ) : Rs.13,999

2.మోటో G40 ( 4GB + 64GB ) : Rs.13,999

ఈ స్మార్ట్ ఫోన్ పైన ICICI సమ్మర్ బొనాంజా అఫర్ కూడా ప్రకటించింది. దీనితో, ICICI బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డుతో ఈ ఫోన్ కొనే వారికీ 1,000 రూపాయల ఇన్స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది.        

Moto G40 : స్పెషిఫికేషన్లు

Moto G40 స్మార్ట్ ఫోన్ పెద్ద 6.8 అంగుళాల డిస్ప్లే తో వుంటుంది. ఈ డిస్ప్లే, FHD+ రిజల్యూషన్ వస్తుంది మరియు 120Hz రిఫ్రెష్ రేటుతో పాటుగా HDR 10 సపోర్ట్ తో వుంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 732G ఆక్టా కోర్ ప్రొసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఇది వేగంగా వుండడమేకాకుండా ఎక్కువ పవర్ ఎఫిషియన్సీ అందించగల ప్రొసెసర్. దీనికి జతగా, 4GB /6GBర్యామ్ మరియు 64GB/128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. అలాగే, మైక్రో SD కార్డు సహాయంతో 1TB వరకూ స్టోరేజ్ పెంచుకోవచ్చు.  

ఇక కెమెరాల విషయంలో, మోటో G40  వెనుక క్వాడ్ కెమెరా ఫంక్షన్ కెమెరా సేటప్పుతో వస్తుంది. అంటే, ఇందులో మూడు కెమెరాలు ఉన్నా కూడా నాలుగు కెమెరాల పని చెయ్యగలదు. ఇందులో, 64MP మైన్ కెమెరా, 8MP (అల్ట్రా వైడ్ +మ్యాక్రో) సెన్సార్ మరియు డెప్త్ సెన్సార్ వున్నాయి. దీనితో, డ్యూయల్ ఫోటో, స్పాట్ ఎఫెక్ట్ ఫోటోలతో పాటుగా చాలా ఫీచర్లతో ఫోటోలు తీసుకోవచ్చని కంపెనీ చెబుతోంది. ముందుభాగంలో, 16MP సెల్ఫీ కెమెరాని అందించింది. అలాగే, వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు ఫ్లాష్ కూడా ఉన్నాయి. అంతేకాదు, ప్రత్యేకమైన Google Assistant బటన్ తో వుంటుంది. ఈ ఫోన్ పెద్ద 6,000mAh బ్యాటరీని 20W టర్బో ఛార్జింగ్ సపోర్ట్ తోకలిగివుంది.         

ముఖ్యంగా, Moto G40 స్మార్ట్ ఫోన్ నియర్ స్టాక్-ఆండ్రాయిడ్ 11 OS తో మరియు ThinkShield ఫర్ మొబైల్ బిల్ట్ ఇన్ హార్డ్ వేర్ సెక్యూరిటీతో వస్తుంది.              

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo