MotoG సిరీస్ నుండి మరో రెండు కొత్త ఫోన్లు!! ఫీచర్లు ఎలా ఉన్నాయంటే!
Moto G సిరీస్ నుండి మరొక రెండు కొత్త ఫోన్లు
Moto 40 మరియు Moto 60 లాంచ్
పెద్ద 6.8-ఇంచ్ డిస్ప్లే, 108MP కెమెరా
మోటోరోలా బడ్జెట్ సిరీస్ అయిన G సిరీస్ నుండి మరొక రెండు కొత్త ఫోన్లు ఇండియాలో విధాలకు సిద్ధంగా వున్నాయి. ఇప్పటికే G సిరీస్ నుండి చాలా ఫోన్లను లాంచ్ చేసిన మోటోరోలా ఇప్పుడు Moto 40 మరియు Moto 60 స్మార్ట్ ఫోన్లను ఇండియాలో లాంచ్ చెయ్యడానికి సిద్దమవుతోంది. ఈ ఫోన్లను ఏప్రిల్ 20 న మధ్యాహ్నం 12 గంటలకి లాంచ్ చెయ్యడానికి డేట్ ఫిక్స్ చేసింది.
మోటోరోలా ఈ ఫోన్స్ గురించి చేస్తున్న టీజింగ్ ద్వారా చాలా ఫీచర్లను వెల్లడించింది. Moto 40 మరియు Moto 60 ఫోన్లలో అందించిన కెమెరా సెటప్ మరియు ప్రొసెసర్ తో పాటుగా మరికొన్ని వివరాలను వెల్లడించింది. ఈ ఫోన్లను Flipkart నుండి సేల్ చెయవచ్చు. ఎందుకంటే, Flipkart ఇప్పటికే ఈ ఫోన్ల కోసం ఒక ప్రత్యేమైన పేజీని కూడా అందించింది.
ఇక ఈ ఫోన్ల ఫీచర్లతో విషయానికి వస్తే, Moto G60 స్మార్ట్ ఫోన్ లో 108MP అల్ట్రా హై-రిజల్యూషన్ మైన్ సెన్సార్ గల ట్రిపుల్ కెమెరా సెటప్ ఉన్నట్లు చూపిస్తోంది. ఈ సెటప్ లో, 8MP అల్ట్రా వైడ్ కెమెరానే 8MP మాక్రో లెన్స్ గా కూడా పనిచేస్తుంది. అంటే, ట్రిపుల్ కెమెరా ఇచ్చిన కానీ క్వాడ్ కెమెరా ఫీచర్లతో వుంటుంది. ముందు భాగంలో, డిస్ప్లే మధ్యలో వున్నా పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా 32MP సెన్సార్ తో వుంటుంది. అదే, Moto 40 కెమెరా విషయానికి వస్తే, ఇందులో 64MP మైన్ కెమెరా వుంటుంది. ఇందులో, పెద్ద 6.8-ఇంచ్ డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ మరియు HDR 10 సపోర్ట్ తో అందించినట్లు వెల్లడించింది. Moto 40 ఫోన్ క్వాల్కమ్ గేమింగ్ ప్రోసిసర్ స్నాప్ డ్రాగన్ 732G తో పనిచేస్తుందని కూడా వెల్లడించింది.