moto g37 and moto g37 power features know before launch
మోటోరోలా బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సిరీస్ అయిన G Series నుంచి రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను రేపు ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేస్తున్నట్లు మోటోరోలా ప్రకటించింది. మోటోరోలా జి సిరీస్ నుంచి Moto G37 మరియు G37 Power స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేస్తుంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కంటే ముందే ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ యొక్క కీలకమైన ఫీచర్స్ కూడా కంపెనీ రివీల్ చేసింది. రేపు విడుదలయ్యే మోటో జి 37 మరియు జి 37 పవర్ రెండు స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ముందే తెలుసుకుందామా.
ఈ రెండు స్మార్ట్ ఫోన్లు కూడా రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయబడతాయి. ఈ రెండు స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం మోటోరోలా పూర్తి ఏర్పాటు చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్స్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకంగా అందించిన మైక్రో సైట్ టీజర్ పేజీ ద్వారా రెండు ఫోన్స్ కీలక వివరాలు రివీల్ చేసింది.
ఇది మోటోరోలా నుంచి వస్తున్న అప్ కమింగ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు బడ్జెట్ ఫీచర్స్ కలిగి ఉంటాయి. ఈ ఫోన్స్ మంచి స్లీక్ డిజైన్ తో ఉంటాయి మరియు వెనుక ప్రీమియం లెథర్ టెక్స్చర్ కలిగి ఉంటాయి. ఈ రెండు ఫోన్లు కూడా గొరిల్లా గ్లాస్ 7i రక్షణ కలిగిన 6.7 ఇంచ్ డిస్ప్లే కలిగి ఉంటాయి. ఈ డిస్ప్లే 1050 నిట్స్ HBM, కలర్ బూస్ట్ టెక్నాలజీ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ రెండు ఫోన్లు MIL STD 810 మిలటరీ గ్రేడ్ సర్టిఫైడ్ డ్యూరబులిటీ కలిగి ఉంటాయి.
ఇక ఈ ఫోన్స్ కలిగిన చిప్ సెట్ విషయానికి వస్తే, ఈ రెండు ఫోన్స్ కూడా మీడియాటెక్ Dimensity 6400 చిప్ సెట్ తో లాంచ్ చేస్తుంది. ఈ ఫోన్ లను ఆండ్రాయిడ్ 16 OS తో లాంచ్ చేస్తుంది మరియు ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 17 కు అప్గ్రేడ్ కూడా అందుకుంటాయి. ఇది కాకుండా 3 సంవత్సరాల రెగ్యులర్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ఈ ఫోన్స్ అందుకుంటాయి. ఈ ఫోన్ 50MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు Dolby Atmos సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా కలిగి ఉంటుంది. ఈ రెండు ఫోన్స్ బ్యాటరీ విషయంలో పెద్ద మార్పు ఉంది. అదేమిటంటే, మోటో జి 37 5200mAh బ్యాటరీ కలిగి ఉంటే, జి 37 పవర్ మాత్రం 7000 mAh బిగ్ బ్యాటరీ 30W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో లాంచ్ అవుతుంది.
Also Read: Realme 16T 5G: రియల్ మీ 8000 mAh బిగ్ బ్యాటరీ లాంచ్ కి సిద్ధం.!
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్స్ ప్రైస్ గురించి మోటోరోలా హింట్ అందించింది. ఈ రెండు ఫోన్లు కూడా అండర్ రూ. 15,000 ప్రైస్ సెగ్మెంట్ లో లాంచ్ అవుతాయని మోటోరోలా తెలిపింది.