Moto G32: 50ఎంపి క్వాడ్ కెమెరా, Dolby Atmos తో బడ్జెట్ ధరలో వచ్చింది.!

HIGHLIGHTS

మోటోరోలా ఈరోజు ఇండియాలో G సిరీస్ నుండి మరొక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను ప్రకటించింది

Moto G32 స్మార్ట్ ఫోన్ ఆకర్షణీయమైన ఫీచర్లతో వచ్చింది

ఈ ఫోన్ లో Dolby Atmos సౌండ్ టెక్నాలజీ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా వున్నాయి

Moto G32: 50ఎంపి క్వాడ్ కెమెరా, Dolby Atmos తో బడ్జెట్ ధరలో వచ్చింది.!

మోటోరోలా ఈరోజు ఇండియాలో G సిరీస్ నుండి మరొక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను ప్రకటించింది. అదే, Moto G32 స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ కేవలం బడ్జెట్ ధరలోDolby Atoms డ్యూయల్ స్పీకర్లు, వెనుక క్వాడ్ ఫిక్షన్ కెమెరా వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లతో వచ్చింది. ఈరోజే ఇండియాలో విడుదలైన మరో ఈ మోటో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ యొక్క స్పెక్స్, ధర మరియు ఫీచర్ల వివరాలను తెలుసుకుందామా. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Moto G32: ధర మరియు లాంచ్ ఆఫర్లు

Moto G32 కేవలం రూ.12,999 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. ఇది 4GB ర్యామ్ మరియు 64GB వేరియంట్ కోసం నిర్ణయించిన ధర. ఈ ఫోన్ ఆగష్టు 16 నుండి Flipkart ద్వారా ఉపలబ్ధమవుతుంది.

Moto G32: స్పెక్స్

Moto G32 ఫోన్ 6.55 ఇంచ్ FHD+ IPSLCD డిస్ప్లేని ఈ ఫోన్ కలిగివుంది. ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది మరియు  20:9 యాస్పెక్ట్ రేషియోతో ఉంటుంది. సెల్ఫీ కెమెరా కోసం పైన మధ్య భాగంలో పంచ్ హోల్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 680 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా 4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ లను అందిస్తుంది.

కెమెరా మరియు ఇతర ఫీచర్ల పరంగా ఈ ఫోన్ వెనుక 50MP క్వాడ్ ఫిక్షన్ రియర్ కెమెరాతోని కలిగివుంది. ఇందులో 50MP మైన్ కెమెరా, 8ఎంపి సెన్సార్  అల్ట్రా-వైడ్ మరియు డెప్త్ కెమెరాగా కూడా పనిచేస్తుంది. చివరిగా  2MP మ్యాక్రో సెన్సార్ కూడా వుంది. ఇక సెల్ఫీల కోసం పంచ్ హోల్ లో 16ఎంపి సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని  33W టర్బో పవర్ ఛార్జర్ తో కలిగివుంది.

ఈ ఫోన్ మరిన్ని ఫీచర్లను చూస్తే, ఇది స్టాక్ ఆండ్రాయిడ్ 12 OS పైన నడుస్తుంది మరియు IPX2 వాటర్ రెపెల్లంట్ డిజైన్ తో వస్తుంది. అద్భుతమైన మ్యూజిక్ మరియు మూవీ ఎక్స్ పీరియన్స్ కోసం ఈ ఫోన్ లో Dolby Atmos సౌండ్ టెక్నాలజీ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా వున్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo