Moto G22: ఏప్రిల్ 8 న వస్తున్న మోటరోలా బడ్జెట్ స్మార్ట్ ఫోన్..!!

HIGHLIGHTS

Moto G22 స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ డేట్ ఫిక్స్

Moto G22 గ్లోబల్ వేరియంట్ విడుదల చేస్తున్నట్లు కనిపిస్తోంది

మోటో జి22 స్మార్ట్ ఫోన్ ఇండియాలో ఏప్రిల్ 8 న వస్తుంది

Moto G22: ఏప్రిల్ 8 న వస్తున్న మోటరోలా బడ్జెట్ స్మార్ట్ ఫోన్..!!

గత నెల మోటోరోలా గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసిన Moto G22 స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ డేట్ ను ప్రకటించింది. మోటో జి22  స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో ఏప్రిల్ 8 న ఆవిష్కరించనున్నట్లు తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ ను నియర్ స్టాక్ ఆండ్రాయిడ్, 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, బిగ్ బ్యాటరీ మరియు 50MP క్వాడ్ రియర్ కెమెరా వంటి మరిన్ని ప్రత్యేకతలతో తీసుకువస్తునట్లు టీజింగ్ చేస్తోంది.  ఈ ఫోన్ కోసం Flipakrt ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ను కూడా అందించింది. అంటే, ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకంగా వస్తోందని అర్ధం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ స్మార్ట్ ఫోన్ కంప్లీట్ వివరాల్లోకి వెళితే మోటరోలా Moto G22 గ్లోబల్ వేరియంట్ ను ఎటువంటి మార్పులు లేకుండా అలాగే ఇండియాలో కూడా విడుదల చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ఫోన్ స్పెక్స్ క్రింద చూడవచ్చు.              

 Moto G22: స్పెక్స్

మోటో జి22 స్మార్ట్ ఫోన్ 6.5 అంగుళాల HD+ డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంది. ఈ డిస్ప్లే మధ్యలో పంచ్ హోల్ డిజైన్ ను కలిగివుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Helio G37 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో వస్తుంది. దీనికి జతగా 4GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. అలాగే, మోటో జి22 Android 12 ఆధారంగా Motorola యొక్క My UX సాఫ్ట్‌వేర్‌పై నడుస్తుంది. డేడికేటెడ్ మైక్రో SD కార్డ్ తో 256GB వరకూ మెమొరీని విస్తరించవచ్చు.

Moto G22-1.jpg

ఈ ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇందులో 50MP ప్రధాన కెమెరాకి జతగా 8MP అల్ట్రా వైడ్ సెన్సార్, 2MP డెప్త్ సెన్సార్ మరియు 2MP మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందుభాగంలో వున్నా సెంటర్ పంచ్ హోల్ కటౌట్ లో 16ఎంపి సెల్ఫీ కెమెరా కూడా వుంది.  ఈ ఫోన్ 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000 mAh బిగ్ బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ డ్యూయల్ నానో-సిమ్, USB-C సాకెట్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్-బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 తో ఉంటుంది.

Moto G22: ధర (గ్లోబల్)

మోటో జి22 స్మార్ట్ ఫోన్ యూరోప్‌ లో 169.99 యూరోలు (సుమారు Rs.14,255) ధరతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ బ్లూ, వైట్, గ్రీన్ మరియు బ్లాక్ కలర్ అప్షన్ లలో లభిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile