Moto G13: మరో రెండు రోజుల్లో లాంచ్ కాబోతోంది..ఇవే ఫీచర్లు.!

Moto G13: మరో రెండు రోజుల్లో లాంచ్ కాబోతోంది..ఇవే ఫీచర్లు.!
HIGHLIGHTS

ఇండియాలో కొత్త ఫోన్ ను లాంచ్ చేయడానికి మోటోరోలా సిద్దమవుతోంది

Moto G13 స్మార్ట్ ఫోన్ మార్చి 29 న లాంచ్ అవుతోంది

లేటెస్ట్ నియర్ స్టాక్ Android 13 OS తో వస్తున్న G13

ఇండియాలో కొత్త ఫోన్ ను లాంచ్ చేయడానికి మోటోరోలా సిద్దమవుతోంది. Moto G13 స్మార్ట్ ఫోన్ ను మార్చి 29వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఫోన్ ను లేటెస్ట్ నియర్ స్టాక్ Android 13 OS తో పాటుగా మరిన్ని ఆకర్షనీయమైన ఫీచర్లతో తీసుకు వస్తునట్లు మోటోరోలా ఇప్పటికి టీజింగ్ మోదలుపెట్టింది. ఈ ఫోన్ యొక్క అంచనా మరియు టీజ్డ్ స్పెక్స్ పైనఒక లుక్కేద్దామా.      

Moto G13: టీజ్డ్ స్పెక్స్

మోటోరోలా ఈ  Moto G13 యొక్క చాలా స్పెక్స్ ను ఇప్పటికే టీజింగ్ ద్వారా వెల్లడించింది. అంతేకాదు, Flipkart ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ను కూడా అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ IPS LCD డిస్ప్లేని   కలిగి వుంటుంది. ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది మరియు సెల్ఫీ కెమెరా కోసం పైన మధ్య భాగంలో పంచ్ హోల్ డిజైన్ వుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Helio G85 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా 4GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ లను కలిగి వుంటుంది.

ఆప్టిక్స్ పరంగా, ఈ ఫోన్ వెనుక 50MP క్వాడ్ పిక్సెల్ రియర్ కెమెరాతో వుంది. ముందు పంచ్ హోల్ లో 8MP సెల్ఫీ కెమెరాని ఈ ఫోన్ కలిగివుంది. ఈ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది. ఈ ఫోన్ లేటెస్ట్ నియర్ స్టాక్ ఆండ్రాయిడ్ 13 OS పైన పనిచేస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో కూడా Dolby Atmos సపోర్ట్ కలిగిన స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయని కంపెనీ టీజింగ్ ద్వారా వెల్లడించింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo