Moto G Max ఫస్ట్ సేల్ ఆఫర్స్ మరియు ఫోన్ ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.!

HIGHLIGHTS

Moto G Max ఫోన్ మొదటి సేల్ కోసం సిద్ధమవుతోంది

బిగ్ బ్యాటరీ మరియు లేటెస్ట్ ఏఐ కెమెరా ఫీచర్స్ వంటి వివరాలతో లాంచ్ అయ్యింది

ఈ ఫోన్ ఫస్ట్ సేల్ ఆఫర్స్ మరియు ఫోన్ ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా

Moto G Max ఫస్ట్ సేల్ ఆఫర్స్ మరియు ఫోన్ ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.!

Moto G Max స్మార్ట్ ఫోన్ మోటోరోలా నుంచి వచ్చిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ మొదటి సేల్ కోసం సిద్ధమవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం మార్కెట్ లో నడుస్తున్న సుందరమైన డిజైన్, బిగ్ బ్యాటరీ మరియు లేటెస్ట్ ఏఐ కెమెరా ఫీచర్స్ వంటి వివరాలతో లాంచ్ అయ్యింది, ఈ ఫోన్ సేల్ కంటే ముందే ఈ ఫోన్ ఫస్ట్ సేల్ ఆఫర్స్ మరియు ఫోన్ ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Moto G Max Price

మోటో జి మాక్స్ స్మార్ట్ ఫోన్ ను రూ. 27,999 ప్రైస్ ట్యాగ్ తో 6GB + 128GB సింగల్ వేరియంట్ లో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ పాంటోన్ మలాగా, పాంటోన్ స్టార్ గేజర్ మరియు పాంటోన్ అలాస్కన్ బ్లూ మూడు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ ఆగస్టు 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ అవుతుంది.

Moto G Max price and features

ఈ ఫోన్ పై కంపెనీ అందించిన లాంచ్ ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ పై రెండు బెస్ట్ డీల్స్ ని మోటోరోలా అందించింది. మొదటిది, Axis అండ్ ICICI బ్యాంక్ కార్డ్ పై అందించిన రూ. 1,000 బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ మరియు రెండోది రూ. 1,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ ఆఫర్. ఈ ఆఫర్స్ తొలి ఫస్ట్ సేల్ నుంచి ఈ ఫోన్ మంచి ఆఫర్ ధరలో లభిస్తుంది.

Also Read: ఉచిత లీగల్ అడ్వైజర్ కావాలా .. మీ కోసమే ప్రభుత్వం Nyaya Setu వాట్సాప్ సేవలు తెచ్చింది.!

Moto G Max Specs

ఈ మోటోరోలా లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ 6.72 ఇంచ్ LCD స్క్రీన్ ని FHD + రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. అంతేకాదు ఈ ఫోన్ 1050 HBM పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. ఈ మోటో ఫోన్ శాటిన్ ఇన్స్పైర్డ్ ఫినిష్ తో గొప్ప లుక్ అండ్ ప్రీమియం ఫీల్ తో వస్తుంది.

మోటోరోలా ఈ ఫోన్ ను Snapdragon 6s Gen 4 చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు జతగా 6GB LPDDR 5X ర్యామ్ అండ్ 12GB ర్యామ్ బూస్ట్ ఫీచర్ తో కూడా వస్తుంది. ఈ ఫోన్ 128GB అంతర్గత మెమరీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను MIL-STD 810H తో మంచి డ్యూరబిలిటీ తో మోటోరోలా అందించింది. ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ OS తో లాంచ్ అవుతుంది. అయితే, 2 మేజర్ OS అప్గ్రేడ్స్ మరియు 3 సంవత్సరాల అప్డేట్స్ రిసీవ్ చేసుకుంటుంది.

కెమెరా విభాగంలో, ఈ ఫోన్ లో 50MP (Sony LYTIA 600) ప్రధాన కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 32MP సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లేటెస్ట్ ఏఐ కెమెరా ఫీచర్స్ మరియు మోటోరోలా కెమెరా ఫీచర్స్ తో వస్తుంది. అయితే, ఈ ఫోన్ లో 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ లేకపోవడం పెద్ద లోటుగా చెప్పవచ్చు. ఇందులో కేవలం FHD వీడియో రికార్డింగ్ సపోర్ట్ మాత్రమే ఉంది. మంచి ఆడియో కోసం స్టీరియో స్పీకర్లు మరియు Dolby Atmos సౌండ్ సపోర్ట్ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile