ఉచిత లీగల్ అడ్వైజర్ కావాలా .. మీ కోసమే ప్రభుత్వం Nyaya Setu వాట్సాప్ సేవలు తెచ్చింది.!
న్యాయపరమైన సమాచారం కోసం ప్రభుత్వం కొత్త సర్వీస్ తెచ్చింది
మీరు ఒక్క రూపాయి చెల్లించకుండా ఉచిత లీగల్ అడ్వైజర్ ని పొందొచ్చు
ప్రభుత్వం కొత్తగా ప్రజల కోసం Nyaya Setu వాట్సాప్ సేవలు తెచ్చింది
ఇంట్లో లేదా ఎవరైనా తెలిసిన వారికి ఏదైనా చట్టపరమైన సమస్యలు వచ్చినప్పుడు చాలా మందికి “లాయర్ ను ఎక్కడ సంప్రదించాలి? ఎంత ఫీజు అవుతుంది? నా సమస్యకు చట్ట పరమైన ప్రాసెస్ ఏమిటి?” అనే ప్రశ్నలు మైండ్ లో మొదలవుతాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో లేదా న్యాయపరమైన విషయాలపై అవగాహన తక్కువగా ఉన్నవారికి చట్టపరమైన లీగల్ ప్రొసీడింగ్స్ కోసం తగిన సమాచారం పొందడం కొంత కష్టంగా ఉంటుంది. ఇలాంటి వారికి న్యాయపరమైన సమాచారం సులభంగా అందించేందుకు భారత ప్రభుత్వం లేటెస్ట్ టెక్నాలజీ సహాయంతో ‘Nyaya Setu’ (న్యాయ సేతు) అనే AI ఆధారిత లీగల్ అసిస్టెంట్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
Surveyఇది కొత్త లీగల్ సర్వీస్ పూర్తిగా ఉచితం మరియు మీ లీగల్ సమస్యలు ఏవైనా చక చకా సొల్యూషన్ చెప్పేస్తుంది. ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సర్వీస్ కావున మీ లీగల్ సమస్యలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి.
Nyaya Setu అంటే ఏమిటి?
Department of Justice, Ministry of Law & Justice ఆధ్వర్యంలోని న్యాయ సేవల యాక్సెస్ ను సులభతరం చేసే AI ఆధారిత డిజిటల్ సహాయక వ్యవస్థగా ఈ న్యాయ సేతు ని పిలవవచ్చు. ప్రజలు తమ చట్టపరమైన హక్కులు, న్యాయ ప్రక్రియలు మరియు అనంతరం తీసుకోవాల్సిన చర్యలను సులభమైన భాషలో అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది.

ముఖ్యంగా, చాలా క్లిష్టంగా అనిపించే న్యాయ విషయాలను కూడా వాయిస్ మరియు టెక్స్ట్ ద్వారా అర్థం చేసుకునేలా ఇది రూపొందించబడింది. 2026 మార్చి 29 న న్యాయ సేతు AI chatbot ను ప్రారంభించారు. ప్రస్తుతం ఇది 22 భారతీయ భాషల్లో వాయిస్ ఫస్ట్ ఇంటర్ ఫేస్ ద్వారా న్యాయ సమాచారాన్ని అందించేలా రూపొందించబడింది. ఇది వాట్సాప్ ద్వారా కూడా అందుబాటులోకి వచ్చింది. అంటే మీ చేతిలో ఉన్న మొబైల్ లో మీ లీగల్ సమస్యలకు న్యాయ సలహాలు పొందొచ్చు.
ఉచిత లీగల్ అడ్వైజర్
మీకు కుటుంబ వివాదం, ఆస్తి సమస్య, ఉద్యోగ సంబంధిత సమస్య, రుణం, ఫ్రాడ్, పోలీస్ ఫిర్యాదు లేదా మరేదైనా న్యాయపరమైన సందేహం ఉంటే, ముందుగా మీ సమస్యకు సంబంధించిన ప్రాథమిక న్యాయ సమాచారం తెలుసుకోవడానికి న్యాయ సేతు మీకు ఉపయోగపడుతుంది.
తెలుగులో కూడా మీ లీగల్ అడ్వైజర్ ని పొందవచ్చు
న్యాయపరమైన పదాలు చాలా మందికి అర్థం కావడం కష్టం. అందుకే ఇందులో ఉన్న బహుభాషా సదుపాయం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రభుత్వ ప్రకారం, 22 భారతీయ భాషల్లో వాయిస్ మరియు టెక్స్ట్ ఆధారిత న్యాయ సహాయాన్ని అందించేలా న్యాయ సేతు రూపొందించబడింది. ఇందులో తెలుగు బాష కూడా ఉంది. కాబట్టి, తెలుగులో కూడా మీ లీగల్ అడ్వైజర్ ని పొందవచ్చు.
Also Read: లేటెస్ట్ 43 ఇంచ్ QLED Smart Tv పై కళ్ళు చెదిరే డీల్స్ అనౌన్స్ చేసిన ఫ్లిప్ కార్ట్.!
వాట్సాప్ లో ఎలా ఉపయోగించాలి
న్యాయ సేతు కోసం ప్రభుత్వం ప్రత్యేకమైన వాట్సాప్ సేవలను కూడా అందించింది, ఈ సేవల కోసం ముందుగా మీరు మీ వాట్సాప్ లో ‘+91 7217711814’ నెంబర్ ను సేవ్ చేసుకోండి. తర్వాత ఈ నెంబర్ చాట్ బాక్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు Tele-Law అని ప్రభుత్వం వాయిస్ మరియు టెక్స్ట్ ద్వారా న్యాయ సమాచారాన్ని అందించే AI chatbot కనిపిస్తుంది. న్యాయ సేతు మరియు టెలీ లా రెండు కూడా ఒకటే కాబట్టి మీరు కంగారు పడకండి.
ఇక్కడ మీ సమస్యను వాయిస్ లేదా టెక్స్ రూపంలో అందిస్తే, ఈ ఏఐ చాట్ బాట్ మీకు న్యాయ సలహాలు ఇస్తుంది. ఇది కాకుండా 14454 టూల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయడం ద్వారా కూడా మీ సమస్యలు తెలియజేయవచ్చు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
