ఫ్లిప్ కార్ట్ నుండి Moto Edge 30 భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది..!

HIGHLIGHTS

మోటోరోలా మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ Moto Edge 30 5G

Moto Edge 30 5G ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ నుండి ఎన్నడూ చూడనంత తక్కువ ధరలో లభిస్తోంది.

Moto Edge 30 ప్రస్తుత డిస్కౌంట్ ఆఫర్ల ద్వారా బడ్జెట్ ధరలో లభిస్తోంది

ఫ్లిప్ కార్ట్ నుండి Moto Edge 30 భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది..!

ఇండియాలో స్నాప్ డ్రాగన్ 778+ 5G మరియు pOLED వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో వచ్చిన మోటోరోలా మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ Moto Edge 30 5G ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ నుండి ఎన్నడూ చూడనంత  తక్కువ ధరలో లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుత డిస్కౌంట్ ఆఫర్ల ద్వారా బడ్జెట్ ధరలో లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ అఫర్ ధర, డీల్స్ మరియు స్పెక్స్ తెలుసుకోండి. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Moto Edge 30: ధర మరియు ఆఫర్లు

Motorola Edge 30 బేస్ వేరియంట్ (6GB + 128GB) రూ.27,999 ధరతో వచ్చింది. అయితే, ఈరోజు ఈ ఫోన్ 4,800 రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.23,199 ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ పైన మంచి ఎక్స్ చేంజ్ అఫర్ ను కూడా ఫ్లిప్ కార్ట్ అందించింది.    

Moto Edge 30: స్పెక్స్

మోటో ఎడ్జ్ 30 స్మార్ట్ ఫోన్ కేవలం 6.9mm మందంతో ప్రపంచంలో అత్యంత నాజూకైన 5G ఫోన్ గా పిలవబడుతుంది. ఈ ఫోన్ వేగవంతమైన క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 778G+ ప్రాసెసర్ తో పనిచేస్తుంది మరియు ఆండ్రాయిడ్ 12-ఆధారిత MyUX సాఫ్ట్‌వేర్‌ను పొందవచ్చు. ఇతర స్పెక్స్ విషయానికి వస్తే, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, USB-C 2.0 పోర్ట్, WiFi 6e మరియు బ్లూటూత్ 5.2 వంటివి ఉన్నాయి.

ఇక గేమర్స్ మరియు OTT కంటెంట్ ను మంచి డెప్త్ తో ఆస్వాదించడానికి వీలైన 144Hz రిఫ్రెష్ రేట్, FHD+ రిజల్యూషన్ మరియు 1 బిలియన్ కలర్ కవరేజీని కలిగిన  pOLED డిస్ప్లే ఈ ఫోన్ లో వుంది. ఈ ఫోన్ 33W టర్బోపవర్ ఛార్జింగ్‌ సపోర్ట్ తో 4,020 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇందులోని స్క్రీన్ కి తగైనా సౌండ్ సిస్టం కూడా ఇందులో అందించింది. ఈ ఫోన్ Dolby Atmos సపోర్ట్ కలిగిం స్టీరియోస్పీకర్లతో వస్తుంది.     

ఈ ఫోన్ వెనుక కెమెరా ప్యానెల్‌లో 50MP ప్రధాన సెన్సార్, 50MP అల్ట్రావైడ్ సెన్సార్ మరియు 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ముందు కెమెరా 32MP సెన్సార్ ఉండవచ్చు. మీరు ప్రైమరీ రియర్ కెమెరా నుండి 4K 30 fps వీడియోలను షూట్ చేయవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile