Moto Edge 30: 144Hz రిఫ్రెష్ రేట్ pOLED తో వస్తున్న మోటో కొత్త ఫోన్..!!

Moto Edge 30: 144Hz రిఫ్రెష్ రేట్ pOLED తో వస్తున్న మోటో కొత్త ఫోన్..!!
HIGHLIGHTS

Moto Edge 30 యొక్క ఇండియా లాంచ్ డేట్ ను ప్రకటించింది

144Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 10-బిట్ pOLED డిస్ప్లేతో వస్తోంది

మోటరోలా మే 12న మోటో ఎడ్జ్ 30 స్మార్ట్ ఫోన్ ను భారతీయ మార్కెట్‌లో ఆవిష్కరించబోతోంది

మోటరోలా తన అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Moto Edge 30 యొక్క ఇండియా లాంచ్ డేట్ ను ప్రకటించింది. అంతేకాదు, ఈ ఫోన్ యొక్క కీలకమైన వివరాలను కూడా టీజర్ ద్వారా వెల్లడించింది. 144Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 10-బిట్ pOLED డిస్ప్లే మరియు వేగవంతమైన క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 778G+ ప్రాసెసర్ వంటి భారీ స్పెక్స్ తో ఈ ఫోన్ ను తీసుకువస్తునట్లు మోటరోలా చెబుతోంది. ఈ మోటో ఎడ్జ్ 30 స్మార్ట్ ఫోన్ ను మోటరోలా మే 12న భారతీయ మార్కెట్‌లో ఆవిష్కరించబోతోంది. మరి ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఎటువంటి ఫీచర్లతో ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టబోతోందో ఓకే లుక్ వేద్దాం.

Moto Edge 30: రివీల్డ్ & అంచనా స్పెక్స్

ఈ స్మార్ట్ ఫోన్ టీజర్ ద్వారా కంపెనీ ఇప్పటికే కొన్ని కీలకమైన వివరాలను వెల్లడించింది. టీజర్ ద్వారా, కేవలం 6.9mm మందంతో మోటో ఎడ్జ్ 30 స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో అత్యంత నాజూకైన 5G ఫోన్ గా పిలవబడుతుంది. ఈ ఫోన్ వేగవంతమైన క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 778G+ ప్రాసెసర్ తో పనిచేస్తుంది మరియు ఆండ్రాయిడ్ 12-ఆధారిత MyUX సాఫ్ట్‌వేర్‌ను పొందవచ్చు.

Moto Edge 30.jpg

ఇక గేమర్స్ మరియు OTT కంటెంట్ ను మంచి డెప్త్ తో ఆస్వాదించడానికి వీలైన 144Hz రిఫ్రెష్ రేట్, FHD+ రిజల్యూషన్ మరియు 1 బిలియన్ కలర్ కవరేజీని కలిగిన  pOLED డిస్ప్లే ఈ ఫోన్ లో వుంది. ఈ ఫోన్ 33W టర్బోపవర్ ఛార్జింగ్‌ సపోర్ట్ తో 4,020 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది, గరిష్టంగా 8GB RAM మరియు 256GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్ కూడా ఉంటుంది.

ఈ ఫోన్ వెనుక కెమెరా ప్యానెల్‌లో 50MP ప్రధాన సెన్సార్, 50MP అల్ట్రావైడ్ సెన్సార్ మరియు 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ముందు కెమెరా 32MP సెన్సార్ ఉండవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo