కేవలం రూ.7,999 ధరతో విడుదలైన Moto E6s స్మార్ట్ ఫోన్

కేవలం రూ.7,999 ధరతో విడుదలైన Moto E6s స్మార్ట్ ఫోన్
HIGHLIGHTS

ఈ స్మార్ ఫోనులో డ్యూయల్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

మోటోరోలా ఈరోజు ఒక ప్రత్యేక కార్యక్రమంలో తన మోటరోలా ఎట్టకేలకు తన Moto E6s స్మార్ట్‌ఫోన్ను భారత్‌లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ను బడ్జెట్ వినియోగ దారులను ఆకట్టుకునేలా కేవలం రూ. 7,999 రూపాయల ధరలో తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సెల్ సెప్టెంబర్ 23 న ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా  జరగనుంది. ఈ స్మార్ ఫోనులో డ్యూయల్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

Moto E6s ఫీచర్

Moto E6s మొబైల్ ఫోన్ ఒక 6.1-అంగుళాల HD + మాక్స్ విజన్ డిస్ప్లేని కలిగి ఉంది మరియు ఈ డిస్ప్లే 19.5: 9 యాస్పెక్ట్ రేషియోని అందిస్తుంది. ఈ స్మార్ట్‌ ఫోనులో వెనుక ఒక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో, ఒక ప్రధాన 13 MP కెమెరా మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ వంటివి ఉన్నాయి. ఈ కెమెరాలో బోకె మోడ్ మరియు ల్యాండ్‌స్కేప్ మోడ్ కూడా ఉన్నాయి. ఇక సెల్ఫీ ప్రియుల కోసం, ఈ ఫోన్‌లో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాని అందించారు.

ముఖ్యంగా, ఈ స్మార్ట్ ఫోన్ స్టాక్ ఆండ్రాయిడ్ తో ప్రారంభించబడింది మరియు ఇది కొత్త అప్డేట్ లను ముందుగా అందుకుంటుంది. ఇది కాకుండా, మీడియాటెక్ హెలియో పి 22 SoC శక్తితో ఈ స్మార్ట్ ఫోన్ నడుస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ తో వస్తుంది, వీటికి తోడు మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా 512 జీబీకి వరకూ మెమోరిని పెంచవచ్చు.

ఇక ఫోన్ భద్రత కోసం ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు ఫేస్ అన్‌లాక్ కలిగి ఉంది మరియు తొలగించగల బ్యాక్ కవర్ మరియు బ్యాటరీతో ఈ ఫోన్‌ను తీసుకువచ్చారు. సంస్థ ప్రకారం, త్వరలో ఈ ఫోను యొక్క వెనుక కవర్ ఫ్లిప్‌కార్ట్‌లో వేరే డిజైన్‌లో అందించబడుతుంది. రిచ్ క్రాన్బెర్రీ మరియు పాలిష్ గ్రాఫైట్ కలర్లో ఈ ఫోన్ ప్రారంభించబడింది.

Moto E6s ధర

మోటో ఇ 6s ధర 7,999 రూపాయలు, ఈ డివైస్ యొక్క మొదటి అమ్మకం సెప్టెంబర్ 23 న ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమవుతుంది మరియు జియో యూజర్లు రూ .2200 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo