వినూత్నమైన కెమేరాతో వచ్చిన మోటో G8 ప్లస్ స్మార్ట్ ఫోన్
ఈ స్మార్ట్ ఫోన్ డిజైన్, మెరుగైన కెమెరాలు మరియు మరెన్నో ప్రత్యేకతలను కలిగి ఉంది.
మోటో జి 8 ప్లస్ ఇప్పుడు అధికారికంగా విడుదలయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ స్పెయిన్లో అక్టోబర్ 24 న ప్రారంభించబడింది. మోటో జి 7 ప్లస్ యొక్క తరువాతి తరం ఫోనుగా వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ డిజైన్, మెరుగైన కెమెరాలు మరియు మరెన్నో ప్రత్యేకతలను కలిగి ఉంది. ఈ మోటో జి 8 ప్లస్ ఆండ్రాయిడ్ 9 పై OS పైన నడుస్తుంది. అయితే, త్వరలో ఆండ్రాయిడ్ 10 అప్ డేట్ ను కూడా విడుదల చేస్తామని మోటరోలా హామీ కూడా ఇచ్చింది. కొత్తగా ప్రారంభించిన ఈ మోటో ఫోన్ గురించి మీరు తెలుసుకోవలసిన విశేషాలు క్రింద చూడవచ్చు.
Surveyమోటో G 8 ప్లస్ ప్రత్యేకతలు
మోటో జి 8 ప్లస్ ఒక 6.3-అంగుళాల FHD + ఐపిఎస్ LCD డిస్ప్లే ను కలిగి ఉంది, ఇది 2280 x 1080 పిక్సెళ్ల రిజల్యూషన్ అందిస్తుంది మరియు 19: 9 యాస్పెక్ట్ రేషియోని కలిగి ఉంది. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 665 ఆక్టా కోర్ ప్రాసెసరుతో పనిచేస్తుంది, ఇది అడ్రినో 610 GPU తో జత చేయబడింది. ఈ స్మార్ట్ ఫోన్ 4 జీబీ ర్యామ్ మరియు 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఇంకా, ఒక డేడికేటెడ్ మైక్రో SD కార్డ్ ద్వారా 512GB వరకు స్టోరేజిని పెంచుకోవచ్చు.ఈ స్మార్ట్ ఫోన్ ఒక 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతిచ్చే 4000 mAh బ్యాటరీతో పాటుగా వస్తుంది .
ఇక కెమేరాల విషయానికి వస్తే, ఈ మోటో జి 8 ప్లస్ వెనుక భాగంలో ఒక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది మరియు ఇందులో : 48 MP ప్రధాన సెన్సార్ (f/ 2.0, క్వాడ్ పిక్సెల్) + 5 MP డెప్త్ సెన్సార్ (f / 2.2) + 16 MP యాక్షన్ కెమేరా (f / 2.2 , క్వాడ్ పిక్సెల్, 2.0um, FOV 117 ° డేడికేటెడ్ అల్ట్రా-వైడ్ కెమెరా) టీతో ఉంటుంది. సెల్ఫీల కోసం, ముందు భాగంలో 25 MP(f / 2.0) సెల్ఫీ కెమేరా ఉంది. వెనుక కెమెరాలో బర్స్ట్ షాట్, ఆటో హెచ్‌డిఆర్, టైమర్, హై రెస్ జూమ్, నైట్ విజన్, షాట్ ఆప్టిమైజేషన్, లైవ్ ఫిల్టర్, పోర్ట్రెయిట్ లైటింగ్, స్మార్ట్ కంపోజిషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటుగా, ఆటో స్మైల్ క్యాప్చర్, సినిమాగ్రాఫ్, కటౌట్ మరియు మరిన్ని ఫీచర్లు కూడా ఉన్నాయి.
మోటో జి 8 ఎఫ్ఎమ్ రేడియో, బ్లూటూత్ 5.0, NFC మరియు మరిన్నింటికి మద్దతు ఇస్తుంది. ఇక సెన్సార్ల విషయానికొస్తే, ఇది ఫింగర్ ప్రింట్ రీడర్, ప్రాక్సిమిటీ, యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్, సెన్సార్ హబ్, గైరోస్కోప్, అల్ట్రాసోనిక్, e-కంపాస్ తో వస్తుంది.
మోటో జి 8 ప్లస్ ధర, లభ్యత మరియు లాంచ్ ఆఫర్లు
మోటో జి 8 ప్లస్ ఫోన్, కాస్మిక్ బ్లూ మరియు క్రిస్టల్ పింక్ వంటి రెండు రంగుల ఎంపికలతో వస్తుంది మరియు దీన్ని ఫ్లిప్‌కార్ట్ ద్వారా అక్టోబర్ చివరి నాటికల్లా సేల్ చేయనున్నారు. భారతదేశంలో ఈ మోటో జి 8 ప్లస్ ధర 13,999 రూపాయలుగా నిర్ణయించారు. అలాగే, లాంచ్ ఆఫర్ల విషయానికొస్తే, కొనుగోలుదారులకు రూ .2,200 వరకు రిలైన్స్ జియో ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ , రూ .3,000 విలువైన క్లియర్‌ట్రిప్ కూపన్, రూ .2,000 విలువైన జూమ్ కార్ వోచర్‌లు లభిస్తాయి
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
