most awaited apple foldable phone Apple iPhone Duo launched
Apple iPhone Duo: ప్రపంచం మొత్తం ఉత్కంఠతో ఎదురు చూస్తున్న మోస్ట్ ఎవైటెడ్ ఐఫోన్, యాపిల్ ఐఫోన్ డుయో ని యాపిల్ ఎట్టకేలకు ఈ రోజు విడుదల చేసింది. ఈ ఫోన్ ను అత్యున్నతమైన ఫీచర్స్ మరియు అల్ట్రా ప్రీమియం డిజైన్ తో లాంచ్ చేసింది. కేవలం పస పోర్ట్ సైజులో విడుదల చేసి అందరిని నివ్వెరపరిచింది. ఇది చూడటానికి అద్భుతమైన డిజైన్ తో ఉండటం మాత్రమే కాకుండా గొప్ప ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ తో ఐఫోన్ ఫోల్డ్ ఫోన్ మార్కెట్ లో ప్రకంపనలు సృష్టించింది.
యాపిల్ ఈ ఫోన్ ను మడత పెట్టగలిగే పెద్ద 7.6 ఇంచ్ మెయిన్ స్క్రీన్ తో అందించింది. అలాగే ఈ ఫోన్ లో 5.5 ఇంచ్ వెలుపల స్క్రీన్ ను అందించింది. ఈ ఫోన్ లో ఉన్న డిస్ప్లేలు కూడా గొప్ప బ్రైట్నెస్ మరియు రిజల్యూషన్ కలిగి ఉంటాయి. ఈ ఫోన్ సెంటర్ స్క్రీన్ యూజర్ నచ్చిన విధంగా మడతపెట్టి చూడగలిగే విధంగా అందించింది. ఈ ఫోన్ ను రోజువారీ తగిన విధంగా రూపొందించినట్లు ఆపిల్ తెలిపింది.