Micromax In 2c: ఇంట్రడక్టరి ప్రైస్ అఫర్ తో ఫస్ట్ సేల్..!!

HIGHLIGHTS

మైక్రోమ్యాక్స్ ఇన్ 2c స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్

మైక్రోమ్యాక్స్ ఇన్ 2సి స్మార్ట్ ఫోన్ పెద్ద 6.52 ఇంచ్ HD+ డిస్ప్లే తో వస్తుంది

3జిబి ర్యామ్ మరియు 32జిబి స్టోరేజ్ జతగా వస్తుంది

Micromax In 2c: ఇంట్రడక్టరి ప్రైస్ అఫర్ తో ఫస్ట్ సేల్..!!

భారతీయ మొబైల్ తయారీ సంస్థ Micromax ఇండియాలో లేటెస్ట్ గా విడుదల చేసిన మైక్రోమ్యాక్స్ ఇన్ 2c స్మార్ట్ ఫోన్ మొదటిసారిగా అమ్మకాలను కొనసాగించనుంది. మైక్రోమ్యాక్స్ ఈ ఇన్ 2సి స్మార్ట్ ఫోన్ ను బడ్జెట్ వినియోగదారులను లక్ష్యంగా తీసుకొచ్చింది. అలాగే, ఈ ఫోన్ బిగ్ బ్యాటరీ మరియు బిగ్ డిస్ప్లే వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో 8 వేల రూపాయల సెగ్మెంట్ లో వచ్చింది. ఈ ఫోన్ రేపు మధ్యాహ్నం, అనగా మే 1వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి సేల్  అందుబాటులో ఉంటుంది.      

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Micromax In 2c: ప్రైస్

మైక్రోమ్యాక్స్ ఇన్ 2సి బేస్ వేరియంట్ 3జిబి ర్యామ్/ 32జిబి స్టోరేజ్ కలిగి కేవలం రూ.8,499 ప్రారంభ ధరతో వచ్చింది మరియు ప్రస్తుతం ఇంట్రడక్టరీ అఫర్ క్రింద రూ.7,499 ధరకే లభిస్తుంది.. మైక్రోమ్యాక్స్ ఇన్ 2బి బ్లాక్, బ్లూ మరియు గ్రీన్ వంటి మూడు కలర్స్ అప్షన్ లలో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ మే 1వ తేదీ నుండి ఫ్లిప్ కార్ట్ మరియు మైక్రోమ్యాక్స్ అధికారిక వెబ్ సైట్ నుండి అమ్మకాలను కొనసాగించనుంది.

Micromax In 2c: స్పెక్స్

మైక్రోమ్యాక్స్ ఇన్ 2సి స్మార్ట్ ఫోన్ పెద్ద 6.52 ఇంచ్ HD+ డిస్ప్లే తో వస్తుంది మరియు ఈ డిస్ప్లే వాటర్ డ్రాప్ డిజైన్ కలిగి ఉంటుంది. ఎండలో కూడా కనిపించేలా ఈ డిస్ప్లే 420 నైట్స్ బ్రైట్నెస్ టి వస్తుంది. ఈ మైక్రోమ్యాక్స్ స్మార్ట్ ఫోన్ Unisoc T610 ఆక్టా కొర్ ప్రొసెసర్ మరియు 3జిబి ర్యామ్ మరియు 32జిబి స్టోరేజ్ జతగా వస్తుంది. SD కార్డు సహాయంతో స్టోరేజ్ మరితంగా విస్తరించవచ్చు.

ఇక కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ 8 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా కలిగిన డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇందులో రెండవ లెన్స్ గా డెప్త్ కెమెరాని అందించింది. ఈ కెమెరా సెటప్ ఆటో HDR, ఫేస్ బ్యూటీ, పోర్ట్రైట్ మోడ్, స్లో మోషన్ మరియు ప్రో మోడ్ వంటి ఫీచర్స్ సపోర్ట్ తో వస్తుంది. మైక్రోమ్యాక్స్ ఇన్ 2సి పెద్ద 5000 mah బ్యాటరీని 10W సాధారణ ఛార్జింగ్ టెక్నాలజీ మరియు టైప్-సి తో కలిగివుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile