అదరగొడుతున్న ఇండియన్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్
మైక్రోమ్యాక్స్ ఇండియాలో కొత్త స్మార్ట్ ఫోన్ ప్రకటించింది.
లేటెస్ట్ ఫీచర్లతో బడ్జెట్ ధరలో అందించింది.
ఇండియన్ ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ ఇండియాలో కొత్త స్మార్ట్ ఫోన్ ప్రకటించింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లను లేటెస్ట్ ఫీచర్లతో బడ్జెట్ ధరలో అందించింది. In 1B మరియు In Note 1 పేరుతో రే ఎంట్రీ ఇచ్చిన మైక్రోమ్యాక్స్ కంపెనీ ఇప్పుడు In 1 స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. అయితే, ఈ ఫోన్ లో చాలా ఫీచర్లు కూడా వీటిని పోలి ఉంటాయి.
Surveyమైక్రోమ్యాక్స్ ఇన్ 1: ధర
మైక్రోమ్యాక్స్ ఇన్ 1 స్టార్టింగ్ వేరియంట్ 4జీబీ మరియు 64జీబీ స్టోరేజ్ తో రూ.10,499 రూపాయలకే లభిస్తుంది. ఈ ఫోన్ యొక్క మరొక వేరియంట్ ను 6జీబీ మరియు 128జీబీ స్టోరేజ్ తో రూ.11,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది. మైక్రోమ్యాక్స్ ఇన్ 1 స్మార్ట్ ఫోన్ మార్చి 26 నుండి మైక్రోమ్యాక్స్ ఇండియా వెబ్సైట్ , Flipkart మరియు త్వరలోనే ఆఫ్ లైన్ మార్కెట్లో కూడా అందుబాటులో ఉంటుంది.
అయితే, మొదటి రోజు సేల్ నుండి ఈ ఫోన్ ను 500 రూపాయల తక్కువ ధరకే కొనవచ్చు. స్టార్టింగ్ వేరియంట్ ను రూ. 9,999 రూపాయలకు, మరొక వేరియంట్ ను రూ. 11,499 రూపాయలకు కొనుగోలు చెయ్యవచ్చు.
మైక్రోమ్యాక్స్ ఇన్ 1: స్పెషిఫికేషన్స్
మైక్రోమ్యాక్స్ ఇన్ 1 ఒక 6.67 అంగుళాల FHD+ డిస్ప్లేతో ఉంటుంది. ఇది 20:9 ఎస్పెక్ట్ రేషియో మరియు చిన్న పంచ్ హోల్ తో వస్తుంది. ఈ స్ట్రీమింగ్ సర్వీసులను ఫుల్ HD లో ప్లే బ్యాక్ చేసేలా L1 సర్టిఫికెట్ ను కలిగి వుంటుంది. మైక్రోమ్యాక్స్ ఇన్ 1 మీడియాటెక్ హీలియో G80 చిప్ సెట్ తో వస్తుంది. ఇది ఆక్టా కోర్ ప్రాసెసర్ మరియు మాలీ-G52 GPU తో పనిచేస్తుంది. దీనికి జతగా 4జీబీ/6జీబీ ర్యామ్ మరియు 128జీబీ వరకూ ఇంటర్నల్ స్టోరేజ్ తో లభిస్తుంది. ఈ ఫోన్, ఆండ్రాయిడ్ 10 OS పైన నడుస్తుంది మరియు త్వరలోనే ఆండ్రాయిడ్ 11 కి అప్డేట్ అవుతుంది.
కెమెరాల పరంగా, ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఇవ్వబడింది. ఇందులో, 48ఎంపీ మైన్ కెమెరా, 2ఎంపీ డెప్త్ సెన్సార్ మరియు 2ఎంపీ మ్యాక్రో సెన్సార్ లను కలిగి ఉంటుంది. ఇక సెల్ఫీల కోసం 8ఎంపీ సెల్ఫీ కెమెరాని ఫోన్ ముందు భాగంలో అందించింది. సెక్యూరిటీ కోసం ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అందించింది. ఇందులో, పెద్ద 5000 mAh బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అందించింది.