భారీగా తగ్గిన Micromax In 2c స్మార్ట్ ఫోన్ ధర.!

HIGHLIGHTS

Micromax In 2c ధర తగ్గించిన కంపెనీ

ఈ ఫోన్ కొత్త ధరను మాత్రం టెంప్టింగ్ గా ఉండేలా చేసింది

మైక్రోమ్యాక్స్ ఇన్ 2c యొక్క కొత్త ధర, ఫీచర్లను కూడా తెలుసుకోండి

భారత మార్కెట్ లో 2022 ఏప్రిల్ నెలలో Micromax విడుదల చేసిన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ In 2C స్మార్ట్ ఫోన్ యొక్క ధరను భారీగా తగ్గించింది. మైక్రోమ్యాక్స్ ఇన్ 2c స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్ లో ప్రవేశపెట్టబడి సరిగ్గా సంవత్సరం అవుతోంది. అయితే, మైక్రోమ్యాక్స్ ఈ ఫోన్ కొత్త ధరను మాత్రం టెంప్టింగ్ గా ఉండేలా చేసింది. మరి, మైక్రోమ్యాక్స్ ఇన్ 2c యొక్క కొత్త ధరతో పాటుగా ఫీచర్లను కూడా చూద్దామా. 

Micromax In 2c: లేటెస్ట్ ప్రైస్

మైక్రోమ్యాక్స్ ఇన్ 2సి స్మార్ట్ ఫోన్ యొక్క బేస్ వేరియంట్ (3GB + 32GB) ఇప్పుడు కేవలం రూ. 5,999 రూపాయలకే లభిస్తుంది. వాస్తవానికి, ఈ ఫోన్ ను కంపెనీ గత సంవత్సరం రూ.8,499 ధరతో లాంచ్ చేసింది. అంటే, రూ.2,500 రూపాయల భారీ తగ్గింపు ఈ ఫోన్ పైన మైక్రోమ్యాక్స్ అందించింది.

 

https://twitter.com/Micromax__India/status/1668148425660207105?ref_src=twsrc%5Etfw

 

Micromax In 2c: ప్రత్యేకతలు

Micromax In 2c బిగ్ 6.52 ఇంచ్ HD+ డిస్ప్లేని కలిగి వుంది మరియు వాటర్ డ్రాప్ డిజైన్ కతో వస్తుంది. ఈ ఫోన్ Unisoc T610 ఆక్టా కొర్ ప్రొసెసర్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ లో వెనుక 8 MP  ప్రధాన సెన్సార్ కలిగిన కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఈ కెమెరా ఫేస్ బ్యూటీ, Auto HDR, పోర్ట్రైట్ మోడ్, స్లో మోషన్ తో పాటుగా Pro Mode వంటి ఇతర కెమేరా ఫీచర్ లను కూడా కలిగి వుంది. 

ఇంకా ఈ ఫోన్ గురించి చెప్పాలంటే, ఈ మైక్రోమ్యాక్స్ ఇన్ 2సి ఫోన్ బిగ్ 5000 mah బ్యాటరీని 10W రెగ్యులర్ ఛార్జింగ్ టెక్ తో కలిగి వుంది. సింపుల్ గా చెప్పాలంటే, 6 వేల బడ్జెట్ ధరలో ఈ ఫోన్ డీసెంట్ కెమేరా, బిగ్ డిస్ప్లే మరియు బిగ్ బ్యాటరీ వంటి ఫీచర్లను కలిగి వున్న ఫోన్ గా నిలుస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :