Chat GPT new update offers information with images in chatbot
Chat GPT లో కొత్త ఫీచర్ వచ్చేసింది మరియు ఈ కొత్త ఫీచర్ అదరగొడుతోంది. ఏమిటా కొత్త ఫీచర్ అనుకుంటున్నారా? చాట్ జిపిటి చాట్ బాట్ లో మీరు అడిగిన ప్రశ్నలు మరియు ఇతరమైన వాటికి ఇప్పటివరకు కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే అందించేది. దానికి తగిన ఇమేజ్ పొందాలంటే ఇమేజ్ ఆప్షన్ క్లిక్ చేసి ప్రాంప్ట్ తో ఇమేజ్ ను క్రియేట్ చేయాల్సి వచ్చేసింది. ఇలా సపరేట్ గా పనులు చేయడానికి చాలా సమయం పట్టేది. అయితే, కొత్త అప్డేట్ తో ఇన్ఫర్మేషన్ ప్లస్ ఇమేజ్ ఒకే సమయంలో అందుకోవచ్చు.
చాట్ జిపిటి నిన్నటి వరకు మేము కేవలం చాట్ బాట్ లో అడిగిన వాటికీ సమాధానాలు మరియు ఇన్ఫర్మేషన్ అందించడం మాత్రమే చూశాము. అయితే, ఈరోజు ఉదయం నుంచి ఇమేజ్ ఆప్షన్ పైన కొత్తగా ‘Updated’ అనే క్యాప్షన్ ఉండటం గమనించాను. ఈ కొత్త అప్డేట్ ఏమిటి, అని చెక్ చేసాను. ఇందులో చాట్ బాట్ లో అడిగిన వాటికి ఇన్ఫర్మేషన్ తో పాటు అవసరమైతే ఇమేజ్ ను కూడా క్రియేట్ చేసి అందిస్తోంది.
ఇది పనిని సులభం చేయడమే కాకుండా మరింత ఉన్నతమైన విలువ ఇచేలా అనిపిస్తోంది. ఉదాహరణకు, మీరు మీ ప్రాజెక్ట్ వర్క్ లేదా స్కూల్ వర్క్ కోసం అవసరమైన ప్రశ్నలు లేదా వివరాలు అడిగితే, పూర్తి ఇన్ఫర్మేషన్ తో పాటు దానికి అవసరమైన ఇమేజ్ కూడా క్రియేట్ చేసి అందిస్తుంది. చాలా మంది అవసరాలకు తగిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ ఇమేజ్ అందించే విధంగా అప్డేట్ అందుకుంది. అది కూడా ఒక ప్రాంప్ట్ తో కంప్లీట్ గా అందిస్తుంది.
Also Read: UPI MDR 2026 కొత్త రూల్ సాధారణ యూజర్ల పై ఎంత ప్రభావం చూపుతుంది.!
చాట్ జిపిటి లేటెస్ట్ గా ఇమేజ్ కోసం కొత్త అప్డేట్ ను కూడా విడుదల చేసింది. ఈ అప్డేట్ ను సెప్టెంబర్ 8వ తేదీకి విడుదల చేసింది.ఈ అప్డేట్ తో ఇమేజ్ క్రియేషన్ పరిధిని మరింత ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లింది. ఈ కొత్త అప్డేట్ తో చాట్ జిపిటి లో మరింత వివరమైన మరియు నిజమైన వివరాలతో ఇమేజ్ లు సృష్టించబడుతున్నాయి. గతం లో అందించిన ఇమేజ్ లతో పోలిస్తే ఈ కొత్త అప్డేట్ తర్వాత చాట్ జిపిటి మరింత షార్ట్ డీటెయిల్స్ మరియు సహజమైన లైటింగ్ తో ఇమేజ్ లను అందిస్తోంది.
అలాగే, మరింత యాక్యురేట్ ఫోటో ఎడిటింగ్, ముఖం మరియు ఇతర వివరాలు మరింత క్లియర్ గా ఉండేలా కొత్త ఇమేజ్ లను అందిస్తోంది. ఇదే కాదు ఇమేజ్ పైనే కామెంట్స్ ను కూడా ఆఫర్ చేస్తోంది. మరింత గొప్ప విషయం ఏమిటంటే, ఇది ఉచితంగా ఈ న్యూ ఇమేజ్ అప్డేట్ ను యూజర్లకు ఆఫర్ చేస్తోంది. మీరు కూడా ఈ అప్డేట్ ను చెక్ చేయాలనుకుంటే, ఇప్పుడు చాట్ జిపిటి లో ట్రై చేయవచ్చు.