Lava Bold N4 Pro 5G launching tomorrow know complete features
Lava Bold N4 Pro 5G: లావా బడ్జెట్ స్మార్ట్ ఫోన్ రేపు మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ ను ‘నో బుల్ షిట్’ ఫోన్ గా లావా అభివర్ణించింది. అలాగే, ఈ క్యాప్షన్ ఇవ్వడానికి తగిన రీజన్ కూడా లావా ఈ ఫోన్ టీజర్ లో వెల్లడించింది. ఈ ఫోన్ లాంచ్ కంటే ముందే ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ మరియు అంచనా ప్రైస్ పై ఒక లుక్కేద్దామా.
లావా బోల్డ్ ఎన్ 4 ప్రో స్మార్ట్ ఫోన్ సెప్టెంబర్ 18వ తేదీన, అనగా రేపు మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ ను ‘నో బుల్ షిట్’ క్యాప్షన్ తో రిలీజ్ చేస్తోంది. ఈ ఫోన్ ను అమెజాన్ స్పెషల్ గా అందిస్తోంది. ఈ ఫోన్ ను అమెజాన్ సేల్ ద్వారా సేల్ చేస్తుంది. ఈ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా ప్రత్యేకంగా అందించిన టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ వివరాలు కూడా అందించింది.
లావా బోల్డ్ ఎన్ 4 ప్రో స్మార్ట్ ఫోన్ ను పెద్ద స్క్రీన్ తో లాంచ్ చేస్తున్నట్టు చెబుతోంది. అలాగే, ఈ ఫోన్ మల్టీ టాక్స్ మరియు లైట్ గేమింగ్ కోసం తగిన లేటెస్ట్ 5జి చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ పై వచ్చిన లీక్ ప్రకారం, ఈ ఫోన్ Unisoc T8200 చిప్ సెట్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే, ఈ చిప్ సెట్ తో జతగా 4జీబీ ర్యామ్ అండ్ 4జీబీ వర్చువల్ ర్యామ్ ఫీచర్ కలిగి ఉండే అవకాశం ఉంటుంది.
ఈ ఫోన్ లో 50MP డ్యూయల్ AI రియర్ కెమెరా ఉండొచ్చని కూడా లీక్స్ చెబుతున్నాయి. అయితే, కంపెనీ టీజర్ లో ఈ ఫోన్ కెమెరా డిటైల్స్ ఇవ్వలేదు. కానీ, ఈ ఫోన్ రియల్ ఇమేజ్ అందించే కెమెరా కలిగి ఉంది, అని లావా తెలిపింది. అలాగే, ఈ ఫోన్ లో 6000 mAh భారీ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫీచర్ ను కంపెనీ అఫీషియల్ గా వెల్లడించింది. అలాగే, ఈ ఫోన్ లో ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉండే అవకాశం ఉంటుంది.
ఇది కాకుండా ఈ ఫోన్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ కూడా క్లీన్ ఆండ్రాయిడ్ మరియు ఉచిత హోమ్ సర్వీస్ తో వస్తుంది. ఈ ఫోన్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతుంది కాబట్టి, ఈ ఫోన్ ప్రైస్ అండ్ అఫీషియల్ ఫీచర్స్ వివరాలు రేపు క్లియర్ గా తెలుస్తాయి.
Also Read: Chat GPT కొత్త ఫీచర్ అదరగొడుతోంది .. ఇన్ఫర్మేషన్ ప్లస్ ఇమేజ్ ఒకే సమయంలో అందుకోండి.!
ఈ ఫోన్ అండర్ రూ. 10,000 రూపాయల బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యే అవకాశం ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేసి చెబుతున్నాయి.