Mi సూపర్ సేల్ : రెడ్మి నోట్ 7 ప్రో పైన 2,000 మరియు రెడ్మి Y3 పైన 3,000 డిస్కౌంట్

HIGHLIGHTS

పోకో ఎఫ్ 1 యొక్క అరమౌర్డ్ ఎడిషన్ కూడా గరిష్టంగా రూ .22,999 ధర వద్ద లభిస్తుంది.

Mi సూపర్ సేల్ : రెడ్మి నోట్ 7 ప్రో పైన 2,000 మరియు రెడ్మి Y3 పైన 3,000 డిస్కౌంట్

షావోమి ఇప్పుడు భారతదేశంలో తన mi సూపర్ సేల్ యొక్క సరికొత్త ఎడిషన్ క్రింద అనేక ఫోన్ల పైన డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ సేల్ ఈ రోజు ప్రారంభమై ఆగస్టు 18 వరకు జరగనుంది. ఇది mi.com  నుండి జరుగనుంది మరియు  వినియోగదారులు రెడ్మి నోట్ 7 ప్రో, రెడ్‌మి నోట్ 7 ఎస్ మరియు రెడ్‌మి వై 3 వంటి ఫోన్‌లను రాయితీ ధరలకు కొనుగోలు చేయవచ్చు. ఇంకా, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 845 SoC వచ్చిన గత సంవత్సరం చౌకైన స్మార్ట్‌ఫోన్, పోకో ఎఫ్ 1 యొక్క అరమౌర్డ్ ఎడిషన్ కూడా గరిష్టంగా రూ .22,999 ధర వద్ద లభిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

రెడ్‌మి నోట్ 7 ప్రో 2000 రూపాయల వరకు తగ్గింపుతో లభిస్తుంది మరియు ప్రారంభ ధర 13,999 రూపాయలతో కొనుగోలు చేయవచ్చు. దీని యొక్క మూడు వేరియంట్లు, 4 జిబి ర్యామ్ + 64 జిబి స్టోరేజ్, 6 జిబి ర్యామ్ + 64 జిబి స్టోరేజ్, 6 జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. రెడ్‌మి 7 ఎస్ రూ .2000 తగ్గింపుతో, రెడ్‌మి వై 3 రూ .3000 వరకు తగ్గింపుతో లభిస్తాయి. మి ఎక్స్ఛేంజ్ ప్రోగ్రాంతో మి ఎ 2, రెడ్‌మి వై 3 మరియు పోకో ఎఫ్ 1 తో రూ .2000 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. మీరు పోకో ఎఫ్ 1 కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు టాప్-ఎండ్ వేరియంట్‌ను రూ .22,999 ధరకు కొనుగోలు చేయవచ్చు.

క్యూ 2 2019 లో షావోమి 28 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానాన్ని నిలుపుకుంది. దేశంలో ప్రజలు ఇప్పుడు రూ .10,000 నుండి 20,000 రూపాయల వరకు ఉన్న ఫోన్‌లను కొనుగోలు చేయాలని చూస్తున్నారని కౌంటర్ పాయింట్ మార్కెట్ మానిటర్ సేవ పేర్కొంది. భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు 37 మిలియన్ యూనిట్లకు పెరిగాయని, కొత్త లాంచ్‌లు, పాత పరికరాల్లో ధరల తగ్గింపు, బ్రాండ్‌లలో ఛానల్ విస్తరణ వంటివి ఈ వృద్ధికి కారణమని తెలిపింది.

ఇటీవల, రెడ్‌మి తన రెడ్‌మి నోట్ 7 ప్రో మరియు రెడ్‌మి 7 ఎస్ స్మార్ట్‌ఫోన్‌ల కొత్త ఆస్ట్రో వైట్ కలర్ వేరియంట్‌ను ప్రకటించింది. రెండు ఫోన్‌లు కొత్తగా లాంచ్ చేసిన కలర్‌లో లభిస్తాయి. రెడ్‌మి నోట్ 7 ప్రో ఇప్పటికే నెప్ట్యూన్ బ్లూ, నెబ్యులా రెడ్ మరియు స్పేస్ బ్లాక్ కలర్ వేరియంట్లలో ప్రకటించగా, రెడ్‌మి నోట్ 7 ఎస్ ఒనిక్స్ బ్లాక్, సఫైర్ బ్లూ మరియు రూబీ రెడ్ కలర్ మోడళ్లలో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo