మి మిక్స్ 4 ఒక 90Hz స్క్రీన్ మరియు 40W ఫాస్ట్ ఛార్జింగ్ తో రావచ్చు

మి మిక్స్ 4 ఒక 90Hz స్క్రీన్ మరియు 40W  ఫాస్ట్ ఛార్జింగ్ తో రావచ్చు
HIGHLIGHTS

మి మిక్స్ 4 శామ్సంగ్ అభివృద్ధి చేసిన 108 ఎంపి కెమెరాతో రావచ్చని భావిస్తున్నారు.

షావోమి సంస్థ, తన మి మిక్స్ 4 స్మార్ట్ ఫోన్, ఈ సెప్టెంబర్ 24 న లాంచ్ చెయ్యడానికి డేట్ ఫిక్స్ చేసింది. ఈ మొబైల్ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 10 ఆధారితమైన  MIUI 11 OS ని అందించబోతోంది. అయితే, ఈ మొబైల్ ఫోన్ గురించి ఇంకొన్ని కొత్త వార్తలు వస్తున్నాయి. వీటి ప్రకారం, ఈ స్మార్ట్‌ఫోన్‌లో 90 HZ రిఫ్రెష్ రేట్‌ కలిగిన గొప్ప స్క్రీన్ కూడా లభిస్తుంది. ఇది కాకుండా, మీరు 40W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నలాజిని కూడా ఈ ఫోనుతో పొందబోతున్నారు. ఈ సమాచారం సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వస్తోంది, దీనిని వీబోలో న్యూ టెక్నాలజీ లో లిస్ట్ చేసింది.

అయితే, వీబో ద్వారా వస్తున్న ఈ కొత్త సమాచారం ఇంకా ధృవీకరించబడలేదు. దీని అర్థం, ఇది కేవలం రూమర్ లేదా ముందస్తు అంచనా సమాచారంగా తీసుకోవాలి. ఈ స్మార్ట్‌ఫోన్ అన్ని స్పెక్స్‌ల పరిధిలో లేనప్పటికీ, పూర్తి సమాచారం కోసం మీరు ఈ మొబైల్ ఫోన్ లాంచ్ అయ్యే వరకు వేచి ఉండాల్సిందే.

షియోమి మి మిక్స్ 4 మొబైల్ ఫోన్ ఇప్పుడు,  వన్‌ప్లస్ 7 ప్రో మొబైల్ ఫోన్‌తో పాటు, నుబియా రెడ్ మ్యాజిక్ 3 లో 90 Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేను కూడా పొందునున్నారని పక్కాగా తెలుస్తోంది.   

ఇక మరికొన్ని నివేదికల ప్రకారం, ఈ ఫోనుకు మరోక పేరు కూడా ఇవ్వవచ్చని చెబుతున్నారు. 'మిక్స్' బ్రాండ్‌ను ఉపయోగించడానికి కంపెనీ లైసెన్స్ త్వరలో ముగియనుంది. కాబట్టి, సంస్థ తన లైసెన్స్‌ను పునరుద్ధరిస్తే, ఈ ఫోన్ మిక్స్ లోగోతో రావచ్చు.

అదే సమయంలో, మి మిక్స్ 4 తో ఎటువంటి ప్రాసెసర్‌ను తీసుకురానుందో ప్రస్తావించలేదు. అలాగే, కెమెరా గురించిన విషయాలు కూడా బయటపడలేదు. షావోమి యొక్క ఈ ఫోన్ MIUI 11 తో నడుస్తుందనే సమాచారం కూడా కనుగొనబడింది.

ఈ సిరీస్‌లో భారతదేశంలో అందుబాటులోకి వచ్చిన చివరి మోడల్ మి మిక్స్ 2. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 చిప్‌సెట్ మరియు 6 జిబి ర్యామ్‌తో కూడిన మి మిక్స్ 2 ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ .29,999 కు లభిస్తుంది. తాజా స్నాప్‌డ్రాగన్ 855 చిప్‌సెట్ మరియు దాని ప్లస్ ఎడిషన్‌ను మి మిక్స్ 4 లో ఉపయోగించవచ్చు. మూలాల ప్రకారం, మి మిక్స్ 4 శామ్సంగ్ అభివృద్ధి చేసిన 108 ఎంపి కెమెరాతో రావచ్చని భావిస్తున్నారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo