Xiaomi ప్రియులకు కనువిందు చేయనున్న Mi A3 స్మార్ట్ ఫోన్ : ఈ 21 వ తేది విడుదల

Xiaomi ప్రియులకు కనువిందు చేయనున్న Mi A3 స్మార్ట్ ఫోన్ : ఈ 21 వ తేది విడుదల
HIGHLIGHTS

ఒక ప్రధాన 48MP కెమేరాతో గల ట్రిపుల్ కేమెరా సెటప్పుతో మరియు 32MP సెల్ఫీ కెమెరాతో కనువిందు చేయనున్నది.

Mi A  3 స్మార్ట్‌ ఫోన్ను ఇండియాలో ఆగస్టు 21 న  లాంచ్ చేయడానికి సిద్ధం అయ్యింది. ఈ హ్యాండ్‌ సెట్ యొక్క ప్రత్యేకతలను మరియు టీజర్ ని కూడా ఇప్పటికే అందించారు. ఆగస్టు 21 న మధ్యాహ్నం 12:00 గంటలకు భారతదేశంలో Mi A 3 ను ఆవిష్కరించనుందని, షావోమి అధికారికంగా ప్రకటించడంతో పాటుగా అమేజాన్ ఆన్లైన్ భాగస్వామ్యంతో సేల్ చేయనున్నట్లు కూడా ప్రకటించింది. అమెజాన్ తన ఆన్లైన్ ప్లాట్ఫారం పైన ఈ ఫోనుకు సంబంధించి ఒక ప్రత్యేకమైన పేజీని కూడా అందించింది. ఈ స్మార్ట్ ఫోన్,  వెనుక ఒక ప్రధాన 48MP కెమేరాతో గల ట్రిపుల్ కేమెరా సెటప్పుతో మరియు 32MP సెల్ఫీ కెమెరాతో కనువిందు చేయనున్నది.  

ముందుగా చేసిన ఒక ట్వీట్‌లో, ఈ చైనా ఫోన్ తయారీదారు గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ అయిన జైన్ ఈ రోజు ఇలా వ్రాశారు, “మేము ఆగస్టు 21 న మధ్యాహ్నం 12 గంటలకు # 48MPAndroidOne ని ప్రారంభిస్తున్నాము, అని ట్వీట్ చేశారు. అలాగే, చైనాలో లాంచ్ చేసిన ఫోన్ స్పెక్స్ పరిశీలిస్తే, ఇది మంచి డిజైన్ మరియు గొప్ప స్పీక్స్ తోరానున్నట్లు తెలుస్తోంది.  

షావోమి Mi A 3, ప్రాథమికంగా షావోమి సిసి 9 ఇ యొక్క ఆండ్రాయిడ్ వన్ వెర్షన్, ఇది ఇటీవల చైనాలో విడుదలైంది. మి A3 లో డిస్ప్లే 1560 x 720 పిక్సెల్స్ రిజల్యూషన్ కలిగిన 19.5: 9 యాస్పెక్ట్ రేషియాతో ఒక 6.01-అంగుళాల సూపర్ అమోలేడ్ ప్యానెల్ తో ఉంటుంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ద్వారా రక్షించబడింది. వెనుక ప్యానెల్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది: ఇది సోనీ IMX586 48MP ప్రాధమిక సెన్సార్ f / 1.8 యొక్క ఎపర్చర్‌తో, f / 2.2 యొక్క ఎపర్చర్‌తో 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్ మరియు f / 2.4 యొక్క ఎపర్చరుతో 2MP డెప్త్  సెన్సార్. ఒక  చిన్న నోచ్ లో ఉంచబడిన సెల్ఫీ కెమెరా, 32 ఎంపి సెన్సార్, ఎఫ్ / 2.0 ఎపర్చరుతో ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo