Mi A3 ఆండ్రాయిడ్ 10 అప్డేట్ అందుకుంటోంది

Mi A3 ఆండ్రాయిడ్ 10 అప్డేట్ అందుకుంటోంది
HIGHLIGHTS

షావోమి సోషల్ మీడియా పోస్టుల్లో వెల్లడించింది.

షావోమి నుండి ఇటీవల ట్రిపుల్ కెమేరా మరియు ఆండ్రాయిడ్ వన్ లో భాగంగా వచ్చినటువంటి, Mi A 3 త్వరలో ఆండ్రాయిడ్ 10 అప్‌ డేట్ పొందబోతోందని, షావోమి  సోషల్ మీడియా పోస్టుల్లో వెల్లడించింది. ఈ మి A3 గూగుల్ యొక్క ఆండ్రాయిడ్ వన్ ప్రోగ్రామ్‌ లో భాగం. సంస్థ యొక్క రెడ్మి కె 20 ప్రో, రెడ్మి కె 20, మి 8 మరియు మి 9 ఆండ్రాయిడ్ 10 తో MIUI 11 అప్‌ డేట్‌ ను అందుకున్నాయి.

షావోమి ఇండియా తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఆండ్రాయిడ్ 10 విడుదలను ప్రకటించారు. ట్వీట్‌ లో ఒక వినియోగదారుని ప్రస్తావిస్తూ, మి ఎ 3 కోసం అప్‌ డేట్ ఫిబ్రవరి మధ్యలో విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.

షావోమి Mi A 3 ఫీచర్లు

షావోమి మి A3 లో ఒక 6.08-అంగుళాల HD + AMOLED డిస్ప్లేతో వస్తుంది మరియు ఇది ఒక 7 వ తరం ఇన్ – డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఇది 720×1560 p రిజల్యూషన్ కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ఒక వాటర్‌డ్రాప్-నోచ్ డిజైన్‌తో 19.5: 9 యాస్పెక్ట్ రేషియోని కలిగి ఉంది. ఇది ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 SoC చేత శక్తిని కలిగి ఉంది, ఇది 4GB / 6GB RAM శక్తితో మరియు 64GB / 128GB వంటి ఇంటర్నల్ స్టోరేజి ఎంపికలతో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్,  3.5 హెడ్‌ఫోన్ జాక్‌ కలిగి ఉంటుంది మరియు ఆండ్రాయిడ్ 9 పై పనిచేస్తుంది.

ఇక కెమెరా విషయానికొస్తే, ఈ ఫోన్  ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో ఉంది, దీనిలో ఎఫ్ / 1.79 లెన్స్‌తో 48 MP ప్రాధమిక సెన్సార్ ఉంటుంది. అలాగే, 118-డిగ్రీల వైడ్ యాంగిల్ f / 1.79 లెన్స్‌తో 8MP సెకండరీ సెన్సార్ మరియు 2MP డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. ముందు భాగంలో 32 MP కెమెరా ఎఫ్ / 2.0 ఎపర్చరు లెన్స్‌తో ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌కు 4030mAh బ్యాటరీ మద్దతు ఉంది, ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.మరియు టైప్-సి యుఎస్‌బి పోర్ట్‌తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo