Meizu నుండి 6GB మరియు 4GB ర్యామ్ తో రెండు కొత్త స్మార్ట్ ఫోన్స్

Meizu నుండి 6GB మరియు 4GB ర్యామ్ తో రెండు కొత్త స్మార్ట్ ఫోన్స్

Meizu కంపెని నుండి Pro 6 అనే మోడల్ పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ వస్తుంది అని రిపోర్ట్స్. దీనిలోని హై లైట్ ఏంటంటే 6GB ర్యామ్ కలిగి ఉండటం. మొబైల్ ఇమేజెస్ మాత్రం రివిల్ కాలేదు. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

చైనీస్ వెబ్ సైట్స్ My drivers లో వెల్లడైన స్పెక్స్ రిపోర్ట్స్ ప్రకారం ఇది రెండు వేరియంట్స్ లో వస్తుంది. ఒకటి 4gb ర్యామ్ – 64gb స్టోరేజ్, మరొకటి 6gb రామ్ – 128 gb స్టోరేజ్.

ఇది ఈ సంవత్సరం ఆగస్ట్ లో రిలీజ్ అవుతుంది అని న్యూస్. దీనిలో శామ్సంగ్ సొంత ప్రొసెసర్ Exynos 8890 ప్రొసెసర్ ఉంటుంది అని రిపోర్ట్స్. శామ్సంగ్ S7 లో ఇదే ప్రొసెసర్ వాడుతుంది.

గతంలో S6 లో శామ్సంగ్ వాడిన సొంత ప్రొసెసర్ చాలా పవర్ ఫుల్ SoC గా సక్సెస్ అయ్యింది. Meizu Pro 6 లో ఇంకా Hi-Fi 3.0 సపోర్ట్, ఫాస్ట్ చార్జింగ్, Flyme 6.0 OS, 3D టచ్ డిస్ప్లే ఉంటాయని రిపోర్ట్స్.

అయితే ఇది ప్రస్తుతం రిపోర్ట్స్ వరకే, కాని ఆల్రెడీ 6gb ర్యామ్ తో మార్కెట్ లో Vivo కంపెని నుండి ఒక స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యింది. దాని పేరు Vivo Xplay 5 Elite. దీనిపై కంప్లీట్ స్టోరీ ఈ లింక్ లో చదవగలరు.

Writer, gamer, and hater of public transport. View Full Profile