ఇటీవలే, షావోమి తను త్వరలో తీసుకురాబోయే ఫోన్లను Mi A 3 సిరీస్ కింద విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ సిరీస్ ఫోన్లలో Mi A 3 మరియు Mi A 3 lite ను ప్రకటించవచ్చు. అంటే, ఈ సంస్థ యొక్క ఈ తాజా ఫోన్లు 'A ' సిరీస్‌లో భాగంగా ఉంటాయి మరియు ఇవి గొప్ప కెమేరా ప్రత్యేకతలతో కెమెరా-సెంట్రిక్ స్మార్ట్ ఫోన్లుగా వుండనున్నాయి. ఈ Mi A 3 సిరీస్ ఫోన్లు చూడాటానికి ఇటీవల ప్రారంభించిన సిసి 9 లాగా అనిపిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ను ఒక క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్‌తో అమర్చవచ్చు.
అతిత్వరలలో రానున్న, ఈ ఆండ్రాయిడ్ వన్ ఫోన్‌ల టీజర్‌ను షావోమి విడుదల చేయడం ప్రారంభించింది. అలాగే, అధికారికంగా ఫోన్‌ల రాక కూడా నిర్ధారించబడింది. కొన్ని రోజుల క్రితం Mi A3 మరియు Mi A3 Lite యొక్క లీక్ అయిన ఇమేజిలు ఒక నివేదికలో వచ్చాయి.
కొత్త నివేదికల ప్రకారం, Mi A3 ని త్వరలో విడుదల చేయనున్నట్లు షావోమి ట్వీట్ చేసినట్లు కూడా తెలుస్తోంది. అలాగే, అభివృద్ధి చెందుతున్నఈ షావోమి స్మార్ట్‌ఫోన్లు ఫోటోగ్రఫీలో మంచి ఫీచర్లతో కూడా రానున్నట్లు సమాచారం. ముందు నుండి వస్తున్నా Mi A1 మరియు Mi A2 ఫోన్ల ప్రకారంగా చూస్తే, ఇవి ఆండ్రాయిడ్ వన్ ప్రోగ్రామ్‌లో భాగం కావచ్చు. అలాగే, స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్‌ను Mi A3 స్మార్ట్‌ఫోన్‌లో ఉపయోగించనున్నట్లు యుఎస్ ఎఫ్‌సిసి జాబితాలో వెల్లడించగా, Mi A3 Lite ఒక స్నాప్‌డ్రాగన్ 675 చిప్‌సెట్‌తో మరియు స్నాప్‌డ్రాగన్ 730 ప్రొసెసరును Mi A3 లో అమర్చవచ్చు అని టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్ తెలిపారు.
మరికొన్ని రిపోర్టులు గమనిస్తే, Mi A 3 ఒక 6.0-ఇంచ్ ఫుల్-HD + (1080×2240 పిక్సెల్స్) వాటర్ డ్రాప్ నోచ్ మరియు అమోలెడ్ డిస్‌ప్లేతో రావచ్చు. అదనంగా, వినియోగదారులకు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా మరియు 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా కూడా ఇవ్వవచ్చు.