శామ్సంగ్ గెలాక్సీ A 91 ఒక 108 MP ప్రధాన కెమెరాతో రానుంది.

శామ్సంగ్ గెలాక్సీ A  91 ఒక 108 MP ప్రధాన కెమెరాతో రానుంది.
HIGHLIGHTS

గెలాక్సీ A91 45W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా కలిగి ఉండవచ్చు.

ఆండ్రాయిడ్ 10 తో సామ్‌సంగ్ గెలాక్సీ A 71, శామ్‌సంగ్ గెలాక్సీ A  91 లను నెదర్లాండ్స్‌లో లాంచ్ చేయనున్నట్లు గెలాక్సీక్లబ్ నివేదిక వెల్లడించింది. వచ్చే ఏడాది మార్చిలో ఈ శామ్‌సంగ్ గెలాక్సీ S 11 లాంచ్ కావడానికి ముందే ఈ ఫోన్‌లను లాంచ్ చేస్తారని భావిస్తున్నారు. బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, ఇటలీ, స్పెయిన్, స్కాండినేవియా వంటి అనేక యూరోపియన్ మార్కెట్లలో గెలాక్సీ A 71 మరియు గెలాక్సీ A  91 లాంచ్ అవుతుందని ఈ నివేదిక అంచనా వేసింది.

శామ్సంగ్ గెలాక్సీ ఎ 71 లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ 48 MP ప్రధాన కెమెరా, 12 MP  వైడ్ యాంగిల్ సెన్సార్, మూడవ 12 MP టెలిఫోటో లెన్స్ (2 ఎక్స్ ఆప్టికల్ జూమ్ తో) మరియు నాల్గవ టైమ్-ఆఫ్-ఫ్లైట్ సెన్సార్ కలిగి ఉంటుంది. శామ్‌సంగ్ ప్రస్తుతం పనిచేస్తున్న సరికొత్త ఎక్సినోస్ 9630 చిప్‌సెట్ ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్‌ను శక్తివంతం చేయవచ్చు.

శామ్‌సంగ్ గెలాక్సీ A 91 ఫోన్‌కు 108 MP  మెయిన్ సెన్సార్ లభిస్తుందని, 16 MP  వైడ్ యాంగిల్ సెన్సార్, 12 MP టెలిఫోటో సెన్సార్ (5 ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో) మరియు ToF  సెన్సార్‌తో జతచేయబడుతుంది. 108 MP  సెన్సార్ 27 MP  రిజల్యూషన్ చిత్రాలను అందిస్తుందనే ఊహాగానాలు ఉన్నాయి.

అదనంగా, గెలాక్సీ A91 45W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా కలిగి ఉండవచ్చు, అది శామ్సంగ్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ 2.0 అని పేరు పెట్టవచ్చు.

శామ్సంగ్ గెలాక్సీ A  91 స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ నోట్ 10-సిరీస్‌లో మనం చూసినట్లుగా స్క్రీన్ కెమెరాతో ఒక 6.7 అంగుళాల డిస్ప్లేని పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌కు క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 855 చిప్‌సెట్ శక్తినివ్వనుంది మరియు ఈ స్మార్ట్‌ఫోన్ శామ్‌సంగ్ అధికారిక వెబ్‌సైట్‌లో కనిపించింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ల ప్రారంభ తేదీ ఇంకా వెల్లడించలేదు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo