రెడ్మి నోట్ 8 స్మార్ట్ ఫోన్ ఏకంగా 25x Zoom మద్దతుతో రావచ్చు.

HIGHLIGHTS

రెడ్మి నోట్ 8 ప్రో లోని 64 మెగాపిక్సెల్ సెన్సార్ 25x జూమ్ సపోర్ట్‌తో అద్భుతమైన పిక్చర్ క్వాలిటీని ఇవ్వగలదని ఈ తాజా టీజర్ చూపిస్తుంది.

రెడ్మి నోట్ 8 స్మార్ట్ ఫోన్ ఏకంగా 25x Zoom మద్దతుతో రావచ్చు.

ఇటీవల రెడ్మి నోట్ 8 ప్రో యొక్క ఒక కొత్త టీజర్ పోస్ట్ ఆన్లైన్లో సందడి చేస్తోంది. రాబోయే రెడ్మి ఫోన్‌ ఏకంగా 25x జూమ్ మద్దతుతో రావచ్చని దీని ద్వారా తెలుస్తోంది. విడుదలైన ర్ టీజర్ ఇమేజ్‌లో చిలుక ఫోటో చొప్పించబడింది, ఇది ఫోన్‌లో 'హెయిర్ లెవల్' యొక్క స్పష్టతను కూడా ఇవ్వగలదని పేర్కొంది. ఇంత స్పష్టత, కేవలం ఈ ఫోటోను 25 సార్లు జూమ్ చేసిన తర్వాతనే వస్తుందని తెలుస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

రెడ్మి నోట్ 8 ప్రో  లాంచ్ అయిన వెంటనే ఒప్పో యొక్క రెనో 2 ఫోన్‌కు గట్టి పోటీని ఇవ్వవచ్చు, ఇది 20x జూమ్ మరియు క్వాడ్ కెమెరా సెటప్‌తో వస్తుంది. రెడ్మి  నోట్ 8 ప్రో కెమెరా, ఫోటోగ్రఫీ అంటే ఇష్టపడే వినియోగదారులకు ఈ ఫోన్ యొక్క ఫీచర్ ప్రత్యేకంగా ఉంటుంది. రెడ్మి నోట్ 8 సిరీస్ యొక్క ప్రో వేరియంట్ 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్‌తో కూడిన సంస్థ యొక్క మొదటి రెడ్మి ఫోన్ అవుతుంది.

రెడ్మి నోట్ 8 ప్రో లోని 64 మెగాపిక్సెల్ సెన్సార్ 25x జూమ్ సపోర్ట్‌తో అద్భుతమైన పిక్చర్ క్వాలిటీని ఇవ్వగలదని ఈ తాజా టీజర్ చూపిస్తుంది. మరొక టీజర్ ప్రకారం, 64 మెగాపిక్సెల్ కెమెరా 9248 x 6936 పిక్సెల్స్ రిజల్యూషన్ ఇమేజ్ ఇస్తుందని తెలుస్తోంది.

రెడ్మి నోట్ 8, రెడ్మి నోట్ 8 ప్రో ఫోన్‌లను ఆగస్టు 29 న లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ ఫోన్ మీడియా టెక్ గేమింగ్ ప్రత్యేకమైన చిప్ సెట్ అయినటువంటి Helio G90T  ప్రాసెసర్ తో రానున్నట్లు అంచనావేస్తున్నారు. కొన్ని లీక్స్ ప్రకారం, ఈ ఫోన్ వెనుక భాగంలో TRIPLE CAMERA SETUP ఇవ్వవచ్చు, ఇది ఫోన్ ఎగువన మధ్య భాగంలో ఉంచబడుతుంది.

అయితే,  రెడ్‌మి నోట్ 7 ప్రోలో ఇది ఎడమ వైపున ఉంది. ఇంకా వేలిముద్ర సెన్సార్ మధ్యలో ఉంది. మూడు కెమెరాలు మరియు వేలిముద్ర సెన్సార్ యొక్క స్థానం క్యాప్సూల్ లాగా ఉంటుంది. అదే సమయంలో, అధికారిక సమాచారం ప్రకారం, నోట్ 7 కంటే రెడ్మి నోట్ 8 లో ఎక్కువ స్క్రీన్ టు బాడీ రేషియో ఇవ్వవచ్చు. అలాగే, కంపెనీ దానిలో పెద్ద బ్యాటరీని కూడా ఉపయోగించవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo