REDMI K30 సిరీస్ లో ప్రపంచంలో అత్యంత గొప్ప రిజల్యూషన్ గల కెమరాతో రానుంది

REDMI K30 సిరీస్ లో ప్రపంచంలో అత్యంత గొప్ప రిజల్యూషన్ గల కెమరాతో రానుంది
HIGHLIGHTS

ఒక స్నాప్ డ్రాగన్730G ప్రాసెసర్ కూడా తెలుస్తోంది.

షావోమి తన REDMI K30 సిరీస్ స్మార్ట్ ఫోన్ను డిసెంబర్ 10 తేదికి చైనాలో విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది కాకుండా, ఈ మొబైల్ ఫోనులో ఒక పంచ్-హోల్ సెల్ఫీ కెమెరామరియు గొప్ప ప్రాసెసర్ వాటి ప్రయోజనాలతో తీసుకురానట్లు కూడా తెలిపింది. అయితే, ఇప్పుడు ఈ మొబైల్ ఫోనులో ఒక ప్రధాన కెమేరాను ప్రపంచంలో అత్యంత గొప్ప రిజల్యూషన్ కెమెరాతో తీసుకురానున్నట్లు కూడా తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది.

ఈ రెడ్మి కె 30 సిరీస్ మొబైల్ ఫోన్లను 5 జి కనెక్టివిటీని పొందబోతునట్లు అర్ధమవుతోంది. ఇది కాకుండా, ఇటీవల వచ్చిన కొన్ని లీకుల ద్వారా ఈ మొబైల్ ఫోనులో ఒక స్నాప్ డ్రాగన్730G ప్రాసెసర్ కూడా తెలుస్తోంది. అయితే, ఈఫోన్ గురించి ప్రస్తుతం ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్న ప్రధానమైన వార్త ఏమిటంటే, ఈ ఫోన్ను ఒక హై రిజల్యూషన్ సెన్సారుతో తీసుకురాబోతోందని. ఈ విధంగా చూస్తే, ఒక 108MP సెన్సారుతో ఈ ఫాంను లాంచ్ చేయవచ్చని కొందరు భావిస్తుంటే, ఈ సెన్సారుతో Mi Note 10 ను తీసుకొస్తుంది కాబట్టి, అదికాకపోవచ్చని కొందరు భావిస్తున్నారు.

అయితే, గాడ్జెట్స్ 360 అందించిన ఒక నివేదిక ప్రకారం చూస్తే, ఈ స్మార్ట్ ఫోనులో సోనీ సంస్థ ఇటీవల 60MP అత్యధికమైన రిజల్యూషనుతో తీసుకొచ్చినటువంటి Sony IMX686 సెన్సారును ఈ ఫోనులో పరిచేయవచ్చని  తెలుస్తోంది. ఇక ఈ సెన్సార్ విషయానికి వస్తే, గొప్ప రిజల్యూషన్ గల చిత్రాలను అందించగల సత్తావున్న సెన్సారుగా, దీని గురించి సోని  అందించిన టీజర్ ద్వారా అర్ధమవుతోంది. ఇదే గనుక నిజమైతే, కేవలం 5G,120Hz డిస్ప్లే తో పాటుగా మరెన్నో ప్రత్యేకతలకు ఈ రెడ్మి K30సిరీస్ స్మార్ట్ ఫోన్లు నెలవు కునున్నట్లు ఊహించవచ్చు.            

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo