లిమిటెడ్ పిరియడ్ అఫర్ : హానర్ 20 పైన రూ.10,000 భారీ డిస్కౌంట్

లిమిటెడ్ పిరియడ్ అఫర్ : హానర్ 20 పైన రూ.10,000 భారీ డిస్కౌంట్
HIGHLIGHTS

ఒక క్వాడ్ రియర్ కెమేరా సెటప్పుతో వస్తుంది.

అమేజాన్ యొక్క ఫోన్ ఫ్యాబ్ ఫోన్ ఫెస్టివల్ రేపటితో ముగియనుంది. ఈ సేల్ నుండి అనేకమైన స్మార్ట్ ఫోన్ల పైన డిస్కౌంట్ తో పాటుగా, మంచి ఆఫర్లను కూడా అందిస్తోంది. అయితే, ఈ సంవత్సరం హానర్ నుండి ఫ్లాగ్ షిప్ ఫోనుగా వచినటువంటి హానర్ 20 స్మార్ట్ ఫోన్ పైన లిమిటెడ్ పిరియడ్ ఆఫరును ప్రకటించింది. ప్రారంభంలో, రూ. 32,999 రుపాయల్ ధరతో మార్కెట్లోకి తీసుకొచ్చినటువంటి ఫోన్ పైన 10,000 డిస్కౌంట్ తో కేవలం రూ.22,999 రుపాయల ధరకే అమ్ముడు చేస్తోంది. అలాగే, 10% తక్షణ డిస్కౌంట్ అందించే HDFC బ్యాంకు ఆఫర్లు కూడా అందిస్తోంది.                    

హానర్ 20 ధర

హానర్ 20 6GB /128GB స్టోరేజి ధర : Rs. 22,999  

హానర్ 20 : ప్రత్యేకతలు

ఈ హానర్ 20 స్మార్ట్ ఫోన్ ఒక పంచ్ హోల్ డిజైనుతో వస్తుంది. ఇది ఒక 6.25 అంగుళాల FHD+ పంచ్ హోల్ డిస్ప్లేతో 2340×1080 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందిస్తుంది. ఇక హానర్ 20 స్మార్ట్ ఫోన్ యొక్క ప్రాసెసర్ విషయానికి వస్తే, హువావే యొక్క ఇది 7nm హై ఎండ్ ప్రాసెసర్ అయినటువంటి Kirin 980 ఆక్టా కోర్ SoC శక్తితో నడుస్తుంది. ఇందులో, 20W వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీతో కూడిన ఒక  3,750mAh బ్యాటరీని అందించారు. ఇది కేవలం 30 నిముషాల్లోనే ఈ బ్యాటరీని 50% వరకూ ఛార్జ్ చేయగలదని సంస్థ పేర్కొంది. ఇక OS విషయానికి వస్తే, ఇది ఆండ్రాయిడ్ 9 ఫై ఆధారియమైన EMUI 9.0.1 తో నడుస్తుంది .       

ముఖ్యంగా, ఇవి వెనుక భాగంలో ఒక క్వాడ్ రియర్ కెమేరా సెటప్పుతో వస్తుంది. హానర్ 20 లో,  ప్రధాన కెమేరా f/1.4 అపర్చరు కలిగిన 48MP కెమేరా Sony IMX586 సెన్సారుతో వస్తుంది. ఇక దీనికి జతగా, 16MP సూపర్ వైడ్ యాంగిల్ కెమేరా, 2MP డెప్త్ కెమేరా మరియు 2MP మాక్రో కెమేరాలు ఉంటాయి. ఈ కేమెరాతో గొప్ప ఫోటోలతో పాటుగా అద్భుతమైన వీడియోలను కూడా తీసుకోవచ్చు. ఇక ముందుభాగంలో, ఒక 32MP సెల్ఫీ కెమెరాని కూడా అందించింది. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ యొక్క SAR వాల్యూ కూడా భారతీయ స్టాండర్డ్ వాల్యూ 1.6W/kg కంటే తక్కువగా ఉంటుంది. దీని యొక్క SAR వాల్యూ 1.08 W/kg గా వుంది.     

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo