2 సేకేండ్స్ లో 70 వేల Le 1S హాండ్ సెట్స్ సెల్

2 సేకేండ్స్ లో 70 వేల Le 1S హాండ్ సెట్స్ సెల్

LeEco Le 1S స్మార్ట్ ఫోన్ నిన్న ఫ్లిప్ కార్ట్ లో మొదటి ఫ్లాష్ సెల్ పూర్తీ చేసుకుంది. ఇండియన్ మార్కెట్ లో తాజాగా అడుగుపెట్టిన ఈ చైనీస్ కంపెని కొత్త రికార్డ్స్ కూడా తీసుకువచ్చింది.

2 సేకేండ్స్ లో 70,000 హాండ్ సెట్స్ సెల్ అయ్యాయి. ఇది ఇప్పటి వరకూ ఏ బ్రాండ్ మోడల్ reach అవ్వని figure, నిన్న రెండు మధ్యాహ్నం 12 గంటలకు మొదలైంది.

ఫ్లాష్ సెల్ కు ముందు 6,05,000 ప్రీ రిజిస్ట్రేషన్లు వచ్చాయి. రిజిస్ట్రేషన్స్ లో కూడా Le 1S కొత్త నంబర్స్ తో రికార్డ్ బ్రేక్ చేసింది. వీటి అన్నిటికి కారణం..

Le 1S పవర్ ఫుల్ స్పెసిఫికేషన్స్ మరియు ప్రీమియం బిల్డ్ – డిజైన్. ఈ రెండూ బడ్జెట్ ప్రైస్ లో 10,999 రూ లకు రావటం మంచి ప్లస్ పాయింట్ అయ్యింది LeEco కు.

1000 పైగా guests తో జనవరి 20 న ఈ చైనీస్ కంపెని ఇండియన్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. Le 1S తో పాటు Le Max ఫ్లాగ్ షిప్ మోడల్ కూడా లాంచ్ అయ్యింది.

అయితే నెక్స్ట్ కమింగ్ – సెకెండ్ ఫ్లాష్ సేల్ ను LeEco Feb 9th న ఇస్తుంది. Feb 2 సాయింత్రం 6 గంటలకు నుండి సెకెండ్ ఫ్లాష్ సేల్స్ కు రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి.

మొదటి ఫ్లాష్ సేల్స్ కు రిజిస్టర్ అయిన మొబైల్ ను కొనలేకపోయిన వారు.. సెకెండ్ ఫ్లాష్ సేల్స్ కొరకు మరలా రిజిస్టర్ చేసుకోవాలి.

Le 1S కంప్లీట్ రివ్యూ ఈ లింక్ లో చూడగలరు.

Le 1S కంప్లీట్ స్పెక్స్ స్టోరీ ఈ లింక్ లో.

Digit.in
Logo
Digit.in
Logo