రెడ్మి ప్రో 2 ఒక స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసర్ మరియు పాప్ అప్ సెల్ఫీ కెమెరాతో రానుందా?

HIGHLIGHTS

Xiaomi CEO Lei Jun అటువంటి డివైజ్ ను గురించి పనిచేస్తునట్లు సమాచారం ఇచ్చారు.

రెడ్మి ప్రో 2 మొబైల్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 855 తో అందించవచ్చని వెల్లడించారు.

ఈ మొబైల్ ఫోన్లో 48MP కెమెరాతో రావచ్చని కూడా అర్ధమవుతుంది.

కొత్తగా లీకైన కొన్ని రెండర్లు, చైనా సోషల్ మీడియా అయిన Weibo లో దర్శన మిచ్చాయి.

రెడ్మి ప్రో 2 ఒక స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసర్ మరియు పాప్ అప్ సెల్ఫీ కెమెరాతో రానుందా?

ఇప్పుడు Xiaomi యొక్క ఉప బ్రాండ్ అయినా రెడ్మి దూకుడు మీదున్నట్లు కనిపిస్తోంది. రెడ్మి బ్రాండ్ గా మార్కెట్లోకి అడుగుపెడుతూనే, అత్యంత తక్కువ ధరలో ఒక 48MP ప్రధాన కెమేరా ఫోన్ను తీసుకొచ్చి ఆశ్యర్యపరిచిన రెడ్మి ఇప్పుడు మరొక సంచలనమైన స్మార్ట్ ఫోన్ను మార్కెట్లోకి తేనున్నట్లు కనిపిస్తోంది. చైనాలోని దేశీయ అతిపెద్ద షోషల్ మీడియా ప్లాట్ఫారం అయినటువంటి Weibo లో చక్కర్లు కొడుతోంది. ఇందులో ఒక మొబైల్ ఫోన్ గురించి వివరిస్తోంది. దీని ప్రకారంగా, ఇటీవల రూమర్లలో నిలచిన, రెడ్మి ప్రో 2 మొబైల్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 855 తో అందించవచ్చని వెల్లడించారు మరియు ఇది కూడా ఒక పాప్-అప్ కెమెరాని కలిగివుంటాయని కూడా వెల్లడించారు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

మీరు ఈ మొబైల్ ఫోన్ పాప్-అప్ సెల్ఫ్ కెమెరాతో వస్తుంది కాబట్టి ఎటువంటి నోచ్ లేకుండా మరియు బెజెల్ – లేస్ డిస్ప్లేతో వస్తుందని కూడా తెలుస్తోంది, అంటే ఇందులో మీరు ఒక పూర్తి స్క్రీన్ ను పొందుతారు. ఇటీవల, Xiaomi CEO Lei Jun అటువంటి డివైజ్ ను గురించి పనిచేస్తునట్లు సమాచారం ఇచ్చారు.

గతంలో వచ్చిన లీక్స్ పరిశీలించి చూస్తే, రెడ్మి నోట్ 7 ప్రో లో చూసిన విధంగా మీరు ఈ మొబైల్ ఫోన్లో 48MP కెమెరాతో రావచ్చని కూడా అర్ధమవుతుంది. అయితే,  ఇప్పుడు ఇచ్చిన రెండర్ల ద్వారా ఇది ఒక ట్రిపుల్ రియర్ కెమేరా సెట్అప్ తో ఉండవచ్చని మనం ఒక అంచనాకి రావచ్చు మరియు అది Xiaomi నుండి రానున్న మొదటి ట్రిపుల్ కెమేరా ఫోనుగా చెప్పవచ్చు.

అంతేకాకుండా, ఈ మొబైల్ ఫోన్ యొక్క ప్రో మోడల్ ఒక ఇన్ డిస్ప్లే వేలిముద్ర సెన్సార్ అందించవచ్చు, ఇది కూడా Xiaomi నుండి మొదటిసారిగా అందనున్న ఫోనుగా చూడవచ్చు. Xiaomi ఈ టెక్నిక్ దాని త్వరలో తమ ఫోన్లలో తీసుకురాబోతునట్లు చెప్పబడింది, అయితే అది ఇప్పటివరకు వచ్చిన ఎటువంటి మొబైల్ ఫోనులో కూడా రాలేదు. ఇప్పుడు ఈ మొబైల్ ఫోనులో కూడా కనిపిస్తోందో లేదో వచ్చి చూడాల్సి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo